కదంబం ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రతి మగవాడు స్త్రీని అబలగా పోలుస్తాడు  ఆమె అబల కాదు సబల అని ఆమె ప్రతి విషయంలోనూ రుజువు చేసుకుంటుంది  గృహస్తు కన్నా ముందే గృహిణి లేచి  ఇంటిని శుభ్రం చేయడం దగ్గర నుంచి  ప్రొద్దుట తినడానికి కావలసిన ప్రతిపదార్థం తయారు చేయడం  ఆ తర్వాత మధ్యాహ్నం వంట ఏర్పాట్లు ఆ సాయంత్రం కాఫీ  తో పాటు మరి కొన్ని చిన్న పదార్థాలు    చిరు తిండి తిరిగి రాత్రి భోజనం చేయడానికి వంట ఏర్పాటు  భర్త పిల్లలు నిద్రించిన తర్వాత తప్ప తాను నిద్రకు ఉపక్రమించదు  ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్త్రీ అపలా అనడానికి  పురుషులకు నోరు ఎలా వచ్చిందో  ఆమె ఆలోచనకు  సమాధానం దొరకడు  క్షమయా   ధరిత్రి  అన్న ఉపనిషత్ వాక్యం  అక్షరాల ఆమెకు  సరిపడినదే  కారణం  నేలకు ఉన్న  ఓర్పు ఆమెకు ఉండడం వల్ల కాచిన చెట్టుకే దెబ్బలు అన్నట్లు  ఇన్ని పనులు ఒంటి చేతితో చేస్తోంది కనుక  ఏవైనా చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు  దానికి కస్సుమంటూ  లేచినా తిక్క మాటలను భరిస్తుంది.
భోజనం చేయడానికి కూర్చున్న తర్వాత గృహస్తు  కూరలో ఉప్పు చాలలేదను  తనకి ఇష్టమైన    కూర వండలేదనో ఆ కంచాన్ని నేలకు వేసి కొట్టినప్పుడు  గృహిణి ఆశ్చర్యపోకుండా  తను కూడా తన కంచాన్ని నేల కేసు కొడితే ఇతని స్థితి ఎలా ఉంటుంది  ప్రతి దానికి తలవంచి ఎదురు చెప్పడం లేదనే కదా  అలా తీసుకోవడం  తాను సురవ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే  మగవాడు తిరిగి తలెత్తుకొని బ్రతకగలడా  ఇంత పని చేస్తున్న ఆ స్త్రీకి  ఆరోగ్యం ఎందుకు బాగుండడం లేదని ఒక్కరోజునైనా ఆలోచించారా  నిజానికి ఎందుకు రావాలి ఇలాంటి చిల్లర మాటలు విని ఎదురు చెప్పడానికి  భర్త మాటకు ఎదురు చెప్పవద్దు అని తల్లి చెప్పిన బోధ  ఆధారంగా మౌనాన్ని వహిస్తుంది తప్ప  ఆ మౌనం వీడితే ఇతని బ్రతుకు ఏమిటి  ఆలోచించాలి.


కామెంట్‌లు