కదంబం - డా.నీలం స్వాతచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ చేసే పని చిన్నదైనా పెద్దదైనా దానినిబట్టి మన మానసకస్థితి ఉంటుంది  ఈ చిన్న పని చేస్తున్నాము ఎవరు  అయినా ఏమైనా అనుకుంటారేమో అని సిగ్గుపడకూడదు  భయం తన దగ్గరకు  రాకుండా చూడాలి  కోట్లు కూడబెట్టిన వారందరూ కూడా కూటికి ఇబ్బంది పడిన వాళ్లే  ఇతరులకు నష్టం కలిగించని ఏ పనైనా సరే కష్టపడి చేస్తే తప్పక మంచి ఫలితాన్ని పొందవచ్చు  అన్నది పెద్దల మాట  ఎడారిలో వర్షం కురవాలని మనం ఆశిస్తే అది నిజమవుతుందా  విశ్వాసం లేని వారి నుంచి కృతజ్ఞత ఆశిస్తే  అది మన అమాయకత్వం కాదా  మంచి విషయాలను గురించి ఆలోచించండి మంచి నిర్ణయాలను తీసుకోండి.
ఎవరు ధనవంతులు ఎవరు బీదవారు అని  నిర్ణయించే జ్ఞానం ఎంత మంది ఉంటుంది  నీ బుద్ధిని  ఉపయోగించి నీవు ఎలాంటి దుర్గుణాలకు చోటు ఇవ్వకుండా  మంచిని మాత్రమే చేస్తూ  తాను చేస్తున్నా  మంచిని ఇతరులతో కూడా చేయించగలిగినవాడు  ఎంత ధనవంతుడో చెప్పడానికి వీలు లేదు  అదే  చెడ్డ గుణాలు ఉన్నవాడు అయితే  అతను చేసే పనులన్నీ చెడు పనులు  సమాజానికి  పనికిరాని పనులే  మల్లెలు ఎక్కడ ఉన్నా మధుర్యములను పంచుతూ ఉంటాయి  మంచి మనసు ఎక్కడున్నా మానవత్వం మూర్తీ భవిస్తూనే ఉంటుంది  కనుక మానవత్వంతో జీవించాలని  పెద్దల సలహా
60 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం చేయాలి  దాని వలన శరీరం దృఢంగా అనిపించదు  వేసవిలో చెమటలు కొట్టడం వల్ల ఎయిర్ కండిషన్ ను వాడుతూ ఉంటాం  ఆ సమయంలో తప్పకుండా నీరు ఎక్కువ తాగాలి  మనం నీటిని గాని ఆహారాన్ని కానీ మోతాదు తీసుకోవడం వల్ల  శరీరం  మెదడు మరింత శక్తివంతంగా ఉంటాయి  జ్ఞాపక శక్తి తగ్గటం వయసులో కాదు ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవడం వల్ల  మీరు ఏది ఇష్టపడితే దానిని మాత్రమే చేయండి  ఏం జరిగినా ఇంట్లో ఎప్పుడు ఉండకూడదు ప్రతిరోజు బయటకు వెళ్లి రావడమే కాకుండా  నడవడం కూడా అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి.


కామెంట్‌లు