కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 మనం పుస్తకాలు చదవమని పిల్లలకు ఎందుకు చెబుతూ ఉంటాం ప్రతి పేజీలోనూ ఏదో ఒక మంచి కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక  ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది అంటారు పెద్దలు  ఏదైనా మంచి విషయాన్ని రాయడానికి సంవత్సరాల పాటు సమయం పడుతుంది  అది తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు  కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులందరికీ బిడ్డల మనస్తత్వాలు పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి  మనం నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం కోరుకున్న స్థాయిలో  మన కష్టమే మనల్ని నిలబెడుతుంది  కష్టేఫలి అని కదా మన పెద్దల సూక్తి  దానిని నమ్మి ఆచరించండి చాలు. మౌనాన్ని గురించి పెద్దలు మనకు అనేక రకాల  నీతులను తెలియజేస్తూ ఉంటారు. మౌనం అర్ధాంగీకారం అంటే వాడు చెప్పిన దానిని మనం సగం ఆమోదించినట్లు లెక్క  మౌనంగా ఉన్నాడు అంటే వాడు ఎందుకు పనికిరాని వాడు ఏమి చేయలేదు అనే అర్థం ఎదుటివారికి వస్తుంది  కానీ మహాత్మా గాంధీ లాంటివాడు కూడా మౌనం వల్ల స్వాతంత్ర్యం సంపాదించాడు అన్న విషయాన్ని మనం మరువకూడదు  మనం మౌనంగా ఉన్నాము అంటే దానిలో అవతల వాడికి ఎన్ని రకాల సమాధానాలు వస్తాయో  మనం ఊహించలేం  మౌనం దాల్చడం వల్ల కలహాలు రాకుండా ఉంటాయి  మనం మాట్లాడుతుంటే  ఏవో కొన్ని మాటలు అయినా ఇతరులకు  కష్టం కలిగించేది ఉండవచ్చు  కనుక మౌనమే శరణ్యం.
నిజానికి వయసు మీరిన తరువాత అనేక పదార్థాలపై మనసు   మల్లుతుంది అది తినాలి అనిపిస్తుంది  అలాంటి సమయంలోనే మనసును అధ్యయనంలో ఉంచుకోవాలి. మీరు జీర్ణం చేసుకోవడానికి ఎంతవరకు తినగలరో అంతవరకే తినాలి  వ్యాధులతో చివరి వరకు పోరాటం కంటే దానితో జీవించడం మంచిది  ప్రతిసారి ఆహారం తిన్న తర్వాత తప్పనిసరిగా కొన్ని గోరువెచ్చని  నీరు తాగాలి మంచం మీద నుంచి లేవవలసి వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడకండి 23 నిమిషాలు వేచి ఉండండి  రోజు ప్రశాంతంగా జీవించండి ప్రతిదీ ప్రశాంతంగా అంగీకరించండి  నవ్వుతూ ఉండండి ఇతరులను లభిస్తూ ఉండండి  ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు చివరి రోజుల్లో మంచానపడవడిసిన అవసరం ఉండదు.


కామెంట్‌లు