కదంబం- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఏ మనిషి అయినా తన సుఖం  తన ఆనందం చూసుకుంటాడు తప్ప  మిగిలిన వాటిని గురించి ఆలోచించే అవకాశం తక్కువ  ప్రస్తుతం వారు ఐదు నిమిషాలు ఏకాంతంగా కూర్చున్నా విపరీతంగా చెమటలు పట్టే పరిస్థితి  ఏసి ఉన్నవారు అది పెట్టుకో లేకపోతే  జీవించలేము అన్నట్లుగా భావిస్తారు  ఏసీ పెట్టుకుంటే చాలా ధనం ఖర్చు అవుతుంది అని తెలుసుకున్న మానవుడు  చెట్లు పెంచితే చల్లదనంతో పాటు వర్షాలు కూడా పడతాయి అని తెలుసుకోలేకపోతున్నాడు.ఆ చెట్లు మనకు ప్రాణవాయువును ఆక్సిజన్ ను  ఇచ్చి ప్రాణాన్ని కాపాడతాయి  దాని పండ్లు  మన ఆకలిని తీరుస్తాయి  చూడడానికి ప్రకృతి దృశ్యం ఎంత అందంగా ఉంటుందో  అది అనుభవించలేకపోతున్నాడు మానవుడు  కనీసం ఒక మనిషి ఒక చెట్టును నాటితే చాలు  దేశం సుభిక్షంగా ఉంటుంది  డబ్బు చేతిలో ఉంటే వ్యసనాలు తక్కువ కాదు  తాగటానికి వాడే గ్లాస్  అవి కలుపుకునే నీళ్లు  దానితోపాటు సోడా  బార్ లో తాగి మత్తు ఎక్కువై ఇంటికి వెళ్లే లోపు దారిలో పడిపోతే వాడిని మోసుకు వెళ్లిన జనం  వారి దృష్టిలో చులకన కావడం  అది చూసి భార్య కన్నీళ్లు పెట్టుకోవడం  వ్యసనం అయితే అలవాటయింది దానికి వచ్చే రోగం ఆసుపత్రిలో పెట్టే ఖర్చు దానికోసం చేసే అప్పు  అప్పు కోసమే ఆస్తి తేడా వస్తే వచ్చే చావు చస్తే చివర్లో మోసే గుంత కాల్చే అగ్ని చివరికి చేసే తిధి గోడకు తగిలించే ఫోటో అన్ని రెండు అక్షరాలు ఈ రెండు విషయాలు గుర్తుంచుకో ఒకటి మద్యపానం వద్దు, కుటుంబమే ముద్దు  మద్యం తాగి వాహనాలు నడపవద్దు  నీతో పాటు  బండిలో ఉన్న మిగిలిన వారికి కూడా ప్రాణహాని అని తెలుసుకో ఈ ప్రపంచంలో ఉన్న  మానసత్వాలను మూడు రకాలుగా విభజించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కవులు కానీ విద్యార్థులు కానీ వేదాంతలు కానీ  అవి  సాత్వికం రాజసం తామసం  సామాన్య మానవుడు  కాలాన్ని నమ్ముకొని జీవిస్తాడు అతను  తనకు ఏది దొరికితే దానితో తృప్తిపడి సర్దుకుపోతాడు  తన జీవితంలో ఏది చేయలేను అని నిరాశ నిష్పృహలతో  ఏ పని చేయడానికి ఉపక్రమించకుండా జీవితాన్ని కాలాన్ని తిట్టుకుంటూ జీవించే రకం  ఒకరు  ఇంకా ఇంకా సంపాదించాలి  అనేక రకాలైన విలాసాలకు జీవితాన్ని అలవాటు చేయాలి  అంటూ పరుగురెట్టి ఎవడు ఇంకొకరక  ఏది ఏమైనా మనిషికి ఉండవలసినవి రెండే సంపదలు  ఒకటి మనశ్శాంతి రెండు  సంతృప్తి  ఈ రెండు ఉన్నవాడికి ఎలాంటి బాధలు ఉండవు  అని పెద్దల ఉవాచ. 

కామెంట్‌లు