కదంబం ;- డా.నీలం స్వాతి ,చిన్న చేరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మనుషులతో పాటు  పశుపక్ష్యాదులు కూడా  హాయిగా ప్రశాంతంగా సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకుంటారు. ఇది ధరంతో కొంటే వచ్చే వస్తువు కాదు  నీ ప్రవర్తనకు వచ్చేది  నీ మంచితనం అందరినీ ఆకర్షిస్తుంది  ఇతరులతో మంచిగా మాట్లాడడం మంచిగా మెలగడం  ప్రేమను కనపరుస్తూ  ఆనందంగా మాటలు కలపడం  వీటన్నిటి కన్నా ముఖ్యం నమ్మకం ఉండాలి  వీడు నటిస్తున్నాడు అన్న అభిప్రాయం వారికి వస్తే  నీ బండారం బయటపడుతుంది  ఇతరుల నుంచి స్వచ్ఛమైన స్నేహం అభిమానులు నీవు కోరుకున్నట్లైతే  అవి మొదట మన దగ్గర ఉండాలి  అని జ్ఞాపకం పెట్టుకోవాలి  మన సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం అలా వెతుకుతూనే ఉంటాం  మన సంతోషాన్ని మనలోనే వెతుక్కోగలిగితే  అనుక్షణం  ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాం  ప్రత్యేకించి కుటుంబ  సభ్యులకు  గౌరవ మర్యాదలు ఇవ్వడం నేర్చుకోవాలి
నవ్వును గురించి అనేక మంది అనేక రకాలుగా  విశ్లేషిస్తూ ఉంటారు  నవ్వు నాలుగు అందాల చేటు అనేది సామెత  నవ్వులో అనేక రకాలు ఉన్నాయి అన్న విషయం మనం మర్చిపోకూడదు  ఎదుటివారితో ఆనందంగా మాట్లాడేటప్పుడు  నవ్వే నవ్వు వేరు  హాసోక్తులతో వచ్చే  నవ్వు మరో రకం  ఆడపిల్ల చిరునవ్వుతో మనల్ని పలకరిస్తే ఆ మొహం  తనకు స్వతహాగాలేని అందాన్ని తెచ్చిపెడుతుంది అన్న విషయం మర్చిపోకూడదు  నీవు ఎప్పుడు అలా చిరునవ్వు చిందిస్తూ ఉంటే నీ మొహం లో ఉన్న  కాంతి ఆనందం అనుభూతి  ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు  అందుకే తాను నవ్వుతూ ఎదుట వారిని నవ్విస్తూ ఉండాలి  అలా అని చెడ్డవారితో కూడా స్నేహం చేసి నవ్వును అక్కడ ప్రదర్శిస్తే అక్కడ  బ్రష్టుడవు అవుతావు  మనం బురద నీటితో చెయ్ స్నానం చేస్తే  శుభ్రంగా ఉండగలమా తాను నమ్మిన భగవత్ స్వరూపాన్ని  పూజించడానికి  ఎవరు అర్హులు  దానికి ప్రత్యేకమైన వయసు ఏమైనా ఉన్నదా ఒక కులం వారు ఒక జాతి వారు ఒక మతం వారు మాత్రమే వాటికి  తగ్గిన వారా  అని ఆలోచించినట్లయితే  కలకత్తా నుంచి ఒక ఉత్తరం ఒక సమస్యను తీసుకొచ్చింది  వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన  శ్రీ రామకృష్ణుడి జన్మదినోత్సవం దక్షిణేశ్వరంలో జరిపారు దాంట్లో కొందరు పాల్గొన్నారు  ఈ విషయం విని కొందరు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి సంకోచించారు  దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి తెలియజేయమని ఆ ఉత్తర సారాంశం  దక్షణ లాంటి గొప్ప తీర్థ స్థలానికి వేశ్యల్ని రానివ్వకపోతే వారు ఇంకా ఎక్కడికి వెళ్తారు  ప్రత్యేకించి పాపాత్ముల కోసమే భగవంతుడు అవతరించాడా?


కామెంట్‌లు