కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నరక ద్వారాలైన స్త్రీ పురుష భేదం కుల ధన విద్యాదివేదాలను లోకానికి మాత్రమే పరిమితం చేయి పవిత్ర తీర్థ పరిసరాల్లో అలాంటి భేదాలు పాటిస్తూ ఉంటే వాటికి నరకానికి తేడా ఏముంటుంది అన్నది  వివేకానంద ప్రశ్న. మనది మహత్తరమైన జగన్నాథ క్షేత్రం పుణ్యాత్ములకు పాపాత్ములకు సాధువులకు దుర్మార్గులకు వయో భేదం పాటించక  స్త్రీలకు పురుషులకు బాలలకు అందరికీ అక్కడ సమానమైన హక్కు ఉంది ఈ సంవత్సరంలో ఒక రోజైన వేలాది స్త్రీ పురుషులు పాప భావాన్ని భేదభావాన్ని విస్మరించి  ప్రభు నామాన్ని గానం చేస్తూ ఆలకిస్తూ మెలగడం అనేది పరమ శ్రేయస్కరమైన విషయం  దీనిలో పతివ్రతలు పాల్గొనాలి అన్న నియమం ఎక్కడా నాకు కనిపించలేదు అంటాడు అయినా తీర్థ స్థలంలోనే ఒక్కరోజు చెడు పాపాలు అణగకపోతే ఆ లోపం మీది కానీ వారిది కాదు దగ్గరకు వచ్చిన వారిని అందరిని కొట్టుకొని పోగల ఆధ్యాత్మిక ఉతుంగ తరంగాన్ని  సృష్టించండి దేవాలయాల్లోనే  ఈమె వేశ్య అతడు నిమ్న కులస్తులు ఇతడి పేదవాడు అతడు పామరుడు అని వివేచించేవారు  ఎంత తక్కువ మంది వస్తే అంత మంచిది స్త్రీ పురుష విభేదాలను కుల తారతమ్యాన్ని గమనించేవాడు భక్తులుగా నటించేవారు మన ప్రభువును అర్థం చేసుకోగలరా  వందలాది వ్యభిచారినీలు వచ్చి ఆయన పాద పద్మాల నుంచి మరో శిరసు కులవాలని ప్రార్థిస్తున్నాను ఒక్క పెద్ద మనిషి అయినా రాకపోయినా పర్వాలేదు రండి సోదరులారా రండి మీరంతా రండి  శ్రీరామకృష్ణుల వాకిలి మీ అందరికీ తెరువ బడింది  ధనికుడు స్వర్గ సామ్రాజ్యంలో ప్రవేశించడం కన్నా సూది బెజ్జంలో ఒంటె దూరడం  సులభం అలాంటి క్రూర రాక్షస భావాలు మీ మనసులో  చోటుచేసుకోనివ్వవద్దు అని నా భావన.కొంత సాంఘిక భద్రత అవసరం మనం దాన్ని ఎలా  సమకూర్చగలం  కొందరు పురుషులు ముఖ్యంగా ముసలివారు యువచోనాడు భద్రత కాపడేవారిగా మసులుకోవాలి ఉత్సవ ప్రాంగణం చుట్టూ వాడు తిరుగుతూ ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు గాని మాటలో గాని ప్రవర్తనలో గాని అసభ్యత కనపరిస్తే ఆ వ్యక్తిని తోట ఆవరణ బయటికి పంపించేయాలి సత్ప్రవర్తన కలిగి ఉన్న స్త్రీ పురుషుడు వారి యోగ్యులైన వ్యభిచారులైనా కూడా వారిని భక్తులు గానే గౌరవించాలి ఒక కోణం నుంచి చూసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు సమస్యలు స్వామీజీకి అవసరం అనే చెప్పాలి  కొద్ది ఉద్దీపనతోనే ధ్యానంలోనూ  సమాధిలోను లయించి పోయే వ్యక్తి ఆయన  అలాంటి వ్యక్తికి  సర్వ సంగ పరిత్యాగికి ఈ భేదాలు  ఉంటాయని ఎలా అనుకుంటాం అన్నారు వివేకానంద.


కామెంట్‌లు