కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
పూర్వకాలంలో స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును పెంచడం ముడి వేసుకోవడం  నుదుటపై బొట్టు పెట్టుకోవడం చేస్తూ ఉండేవారు  ఈ బొట్టు పెట్టుకోవడంలో శాస్త్రీయత ఉన్నది  ఆ ప్రాంతంలో ఉన్న బ్యాక్టీరియా రోగకారక క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేస్తుంది  అక్కడే బొట్టు పెట్టుకోవడానికి కారణం  మొదట చెమట పట్టేది నొసల దగ్గర  కనుక అక్కడ నాశనం చేయవలసిన అవసరం ఉందని శాస్త్రజ్ఞులు అలా ఏర్పాటు చేశారు  ఏ మనిషికైనా ఏదైనా చిన్న కష్టం వచ్చినా  ఇబ్బంది పడ్డా అయ్యో రామా అని  రామ నామాన్ని తలుచుకోవడం సహజం  రామనామం చెప్పని నోరు  ఈ జగతిలో ఉండదు అని ప్రసిద్ధి  ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉండి తీరుతుంది
బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు  పెంచితే శివుడు ప్రణాళికా బద్ధమైన జీవితానందిస్తాడని పెద్దలు చెప్తారు  కనక ప్రతి గ్రామంలోనూ శివాలయాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేయడం  రివాజు  భాగవతంలో పోతన గారు చెప్తారు  నోరు ఉన్నది నీతో మాట్లాడడానికి చెవులు ఉన్నది నినాదాలను వినడానికి  మానవునికి చేతులు ఉండడం ఇతరులకు సహాయం చేయడానికి అని ప్రహ్లాదుని ద్వారా చెప్పిస్తాడు  పుస్తకం చదవడం కాదు దానిలో విషయాన్ని జీవితంలో ఆచరించినప్పుడు  ఆ పుణ్యం మనకు దక్కుతుంది అని చెబుతారు  ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది ఆ మనసు పర పరి విచారణ ఆలోచిస్తూ ఉంటుంది  కొన్ని మంచి ఆలోచనలు రావచ్చు మరి కొన్ని చెడ్డ ఆలోచనలకు కూడా అవకాశం ఉంటుంది.
మనసుకు శాంతి లేక పోయిన తర్వాత ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత చదువుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు  అనుక్షణం అలాంటి ఆలోచనలతోనే కాలం గడిపే వాడికి జీవితంలో శాంతి ఎక్కడ లభిస్తుంది  శరీరానికి బలం ఉండాలి జీవితానికి ఆధ్యాత్మికత ఉండాలి  తన మనసు తన అధీనంలో ఉండాలంటే  అడవులకు వెళ్లి తపస్సు చేయనవసరం లేదు  తనకు ఎలాంటి చెడ్డ ఆలోచనలు రాకుండా మనసును తన అధీనంలో ఉంచుకుంటే చాలు  తాను ఏ పని చేయాలన్నా ఆ శరీరానికి బలం ఉండాలి  ఆ బలం కావాలంటే  వ్యాయామం ఉండాలి  అది విరామం లేకుండా నిత్యం చేయాలి  ఇవన్నీ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన  పెద్దలు చెప్పిన మాటలు వాటిని విని ఆచరించినట్లయితే జీవితం ఆనందమయంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

కామెంట్‌లు