కదంబం ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్లు సంపాదించినా మీ శరీరం ఆరోగ్యంగా ఉండకపోయినట్లయితే  జీవిత ప్రయోజనం దెబ్బతింటుంది  కనుక ఎక్కువ వేయించినవి కానీ కారంగా ఉండే ఆహారం కానీ తినేటప్పుడు  పెద్దప్రేగులు గాయపడతాయి అన్న విషయం మర్చిపోవద్దు  పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు  కలుషిత సిగరెట్ల వాతావరణంతో ఉన్నప్పుడు  లంగ్స్ గాయపడతాయి  బాగా వేయించిన ఆహారం జంక్ ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది  ఎక్కువ ఉప్పు కొలెస్ట్రాల్ తో భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది  ఈ భాగాలన్నీ నీ డబ్బుతో విఫణిలో కొనలేవు కారణం అది దొరికే వస్తువులు కాదు  నీ జాగ్రత్తలో నీవుండి నీ శరీర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నట్లయితే సుఖమయ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మన పూర్వులు జాతీయాలు అన్న పేరుతో  జీవితంలో అనుసరించవలసిన విషయాలను గురించి మనకు తెలియజేశారు  పశువుకు తిన్నది తృప్తి మనిషికి ఉన్నది తృప్తి అని  లోకోక్తి  తిని దానిని జీర్ణం చేసుకొని  దాని సుఖాన్ని అనుభవించడం భౌతికం శారీరకం  నీకు ఆస్తి గాని ధనం కానీ విద్య గాని  ఉన్నదో  దానివల్ల మానసిక తృప్తి పెరుగుతుంది  ఎప్పుడు విద్యాధికుడయ్యాడో అతనికి మానసిక పరిణతి పెరిగి  సమాజంలో ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న విషయాలన్నీ కూడా  అవగతమవుతాయి  ఎప్పుడు తృప్తి కలిగిందో వారి మనసులో ఆనందం ఆలోచనలో ప్రశాంతత ముఖంలో జరగని చిరునవ్వు  పలకరింపులో ప్రేమ  ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి  లేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నవాళ్లు  కూడా ఉన్నదానిని సరిపెట్టుకొని  దానితో సుఖంగా ఉండాలని చెప్తారు పెద్దలు.
అదృష్టం అంటేనే  తాను అనుకోకుండా వచ్చే లబ్ధి  ఊహించకుండా వచ్చిన దానిని  అదృష్టం అని చెప్తారు మనవాళ్లు  కానీ అలాంటి మాటని నమ్మవద్దు  నీవు నిజమైన  కార్యసాధకుడవు అయితే  నీవు ఏది అనుకుంటున్నావో దానిని సాధించడానికి స్వయం కృషి ఉండాలి  అది ఎలా సాధ్యం చేయాలో దాని మార్గాలు ఏమిటో  తెలుసుకోవాలి  ఆ విషయాలలో నీకు ఎవరు సలహాలు ఇస్తూ ఉంటారో వారి దగ్గర తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి  అంతేతప్ప ఊహల్లో జీవించకూడదు  ఏదైనా గొడవ జరిగినప్పుడు మధ్యలో వీడి తరపు మాటలు కలపకూడదు  అలా చేస్తే ఉన్న బంధం తెగిపోతుంది  అందుకే పెద్దలు మౌనం వహించమని చెప్తారు  మౌనం  కలహాలు రాకుండా చేస్తుంది  అందరితో చక్కటి  స్నేహ సుహృద్భావాలు కలిగి ఉండేలా  చేస్తుంది  అందుకే పెద్దల మాట చద్ది మూట అంటారు.


కామెంట్‌లు