కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ రోజున సాంకేతికత పెరగడంతో  రైస్ కుక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి  దానిలో గంజి ఏమాత్రం ఉండదు  గంజిని అన్నంలో కలుపుకొని చిటికెడు ఉప్పు  వేసుకొని తింటే ఆ రుచి వేరు  ఇలా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంతోపాటు జ్వరం ఉన్నప్పుడు తాగితే త్వరగా తగ్గేలా చేస్తుంది అంతేకాదు చర్మానిస్తున్న అందంగా ఉండేట్లుగా చేస్తుంది  చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది జనక్రియను మెరుగుపరుస్తుంది మలబద్దకాన్ని లేకుండా చేస్తుంది. విరోచనాలు వాంతులు అవుతున్నప్పుడు గంజిని తీసుకుంటే దీనికి మించిన గొప్ప దివ్య ఔషధమే లేదు అని మన పెద్దలు చెప్తారు  అనుభవజ్ఞులు కనుక
సమాజంలో ప్రతివాడికి ఆత్మీయులు ఉంటారు బంధువులు ఉంటారు  అయితే నిజమైన బంధువులు ఎవరు అంటే  జీవితంలో నీకు జన్మనిచ్చిన తల్లిలా కాపాడేది సత్యం  నీ బాల్యంలో వేలు పట్టుకుని తీసుకుని వెళ్లి జ్ఞానాన్ని  అందచేసిన తండ్రి  విజ్ఞానానికి ప్రతీక  ఆడుతూ పాడుతూ ఉంటేనే సోదరులు  ధర్మానికి కట్టుబడి ఉంటారు  దయాగుణం స్నేహితుడు  సహ ధర్మచారినే భార్య అంటేనే శాంతమూర్తి    కుమారుడు క్షమాగుణం  ఈ ఆరు రుణాలు నీతో ఉన్నట్లయితే సమాజానికి నీవు ఎంతో మేలు చేసిన వాడు అవుతావు  సమాజం మొత్తం నిన్ను ఎంతో గౌరవిస్తుంది  రాముడు బుద్ధిమంతుడు అన్నట్టుగా  నిన్ను ధర్మాత్ముడిగా చూస్తుంది సమాజం  అది నీవు గుర్తుంచుకుంటే చాలు.


కామెంట్‌లు