ఎండ ; - ఎండీ. రియాజ్ 9వ. తరగతి Z. P. H. S నీర్మాల

 భగ భగ మండుతుంది ఎండ 
దాని వల్ల పుడుతుంది భయం గుండెల నిండా..
ఏం చెయ్యాలో అర్థంకాదు ఈ ఎండకి 
నీరు తాగుతూనే ఉండాలి గంట.. గంటకి 
ఎండలో తగులుతుంది వడదెబ్బ 
అందరు ఈ ఎండకి అంటున్నారు అమ్మ.. అబ్బా 
ఎండకి ఉండాలి నీడలో 
ప్రయత్నించాలి ఉండడానికి చల్ల గాలిలో 
పోవాలి.. పోవాలి.. ఈ ఎండలు 
ఎండ పోతే వేస్తాము దండలు.
జాగ్రత్త పడండి ఎండకి
దయచేసి ఉండండి నీడకి..
జాగ్రత్త.. జాగ్రత్త.. ఈ ఎండకి 
నీడలో చల్ల గాలిలో ఉండండి ఈ మంటకి 
ఎండలో సెలవులు వచ్చాయని ఆడుకుంటారు పిల్లలు 
జర పిల్లల్ని జాగ్రత్తగా చూడండి అమ్మలు.. 🙏🙏
=====================================
       (   పద్మ త్రిపురారి మేడం గారి సహకారంతో)
కామెంట్‌లు