ఈనాటి నాయకులు
ఓటు వేసే వరకే
నీ మాట వింటారు
ఆపైన నీవు
ఎవ్వరూ అంటారు ?
అమలు గాని
హామీలను ఇస్తారు !
ఇప్పుడే...
స్వర్గలోకాన్నీ చూపిస్తారు
ఆ తర్వాత
బ్రతుకంతా నరకం చేస్తారు
విజ్ఞతో ఆలోచించు...
నీకు తోడుగా ఉండే వాడిని
నీకు నీడగా నిలిచే వాణ్ణి
నిత్యం ప్రజా సమస్యలను
తీర్చేవాణ్ణి
నీవు ఎన్నుకుంటే
నీ ఓటు విలువైందే !
ఓటు పడే వరకే
నాయకుల ఉపన్యాసాలు
ఆపై ఐదు సంవత్సరాలు
మాయాబజారే !
ఈనాడు ఎన్నికల పోటీలో
నిలబడ్డ ఏ నాయకుడు
కూటికి లేని వాడు కాదు
ఐదేళ్లలో మీ ఓటుతో
ఆ కోట్లు వృద్ధి చెందుతాయి
నీవు మాత్రం బక్క చిక్కిన
ఎముకల గూడువే !?
ఓటరన్నా నిజాన్ని గ్రహించు
నిజాయితీపరున్ని గెలిపించు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి