హవిస్సు ;- మమత ఐల- హైదరాబాద్ 9247593432
రోజుకొక్క పిడుచచొప్పునాహారమును
తినే ముందు బెట్టు చుండె చెట్టు క్రిందను
కాకి ఒకటి తినుకుంటు రోజురోజున
ప్రతిఫలంబు నివ్వ దలచె పండు ముసలికి

హవిస్సులతొ తీరిపోయె ఆకలి యనుచు
వరమేదైనడుగుమని బలిమి జేసెను
తీర్చలేని కోరికని ముసలి చెప్పగా
తప్పకుండ తీర్చెదనని నొక్కిచెప్పెను

శ్రీదత్తుని దర్శనమును కోరు చుంటుని
కోరికలీవయసు నందు ఏమి లేవనె
దూరముండి జూపింతు దారి నేనని
వేంటబెట్టి తీసుకెళ్లె వేగిరంబున

దైవమువలె కానరాడు ధరణి యందున
పాద పద్మములు దొరుక పట్టి విడువకు
కాదనుచునె దర్శనంబు నిచ్చు దైవము
అనుచు జూపె దైవంబును ముసలి తాతకుకామెంట్‌లు