ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 వారి అమ్మాయి లక్ష్మి అబ్బాయి కృష్ణ కూడా మాకు అప్పుడప్పుడు పాఠాలు చెబుతూ ఉండేవారు  కేరళ నుంచి వచ్చిన డాక్టర్ నాయర్ గారు ఎక్కడా స్థలం దొరక్క మా గురువుగారి ప్రక్కనే ఉన్న చిన్న గదిని ఆయనకు కేటాయించారు  ఆయన ఎప్పుడూ మా ప్రక్కనే ఉండేవారు మా క్షేమ సమాచారాలు చూస్తూ ఉండేవారు మాకు ఏ దగ్గు వచ్చినా టూమ్ము వచ్చిన ఆయనే  వైద్యం చేసేవారు  వారికి 16-17 సంవత్సరాల వయసులో ఉన్న కుమార్తె ఉంది సాయంత్రం పూట తండ్రి కుమార్తెలు ఇద్దరు సైకిల్ మీద ఊరు మొత్తం తిరిగి వచ్చేవాళ్ళు  ఊరి వారు దాన్ని చూడడానికి మా గ్రామంలో ఆడవారు గుమ్మాల వద్దకు చేరేవారు అదొక ఆకర్షణ  సుశీల మేట రామయ్య గారి అమ్మాయి మంచి ఆస్తిపరుడు మా గ్రామంలో రెండు అంతస్తుల మేడ ఉంది వారికే
వాళ్ల దొడ్లో నేరేడు చెట్టు ఉండేది ఆ చెట్టు కింద మేము రామయ్య గారికి తెలియకుండా దొంగతనంగా పళ్ళు కోసుకుని తినడం ఎంతో ఆనందంగా హాయిగా అనిపించేది ఆ రోజుల్లో నేను సుశీల నాలుగో తరగతిలో ఉండగా 1947 ఆగస్టులో  మా గ్రామానికి హైస్కూల్ వచ్చింది  మా నాన్న కాకాని వెంకటరత్నం  గారు బెజవాడ గోపాల్ రెడ్డి గారు  కలిసి జేఏసీలో ఉన్నారు ఆ పరిచయంతో కాకాని వారు జెడ్పి చైర్మన్గా ఉన్నప్పుడు మా గ్రామంలో చదువుకోవడానికి హైస్కూల్  వచ్చేలా ఏర్పాటు చేసింది వాడే వారి వల్ల కొన్ని వేలమంది అక్షరాస్యులు మా గ్రామంలో తయారయ్యారు  అప్పుడు నన్ను సుశీలను ప్రమోట్ చేసి హైస్కూల్లో ఆరో తరగతిలో చేర్పించారు దానిని ఫస్ట్ ఫామ్ అనేవారు ఆ రోజుల్లో అప్పుడు వచ్చే ఉపాధ్యాయులు అంతా కోటు వేసుకుని వచ్చేవాళ్లు తెలుగు ఉపాధ్యాయులు మాత్రం పంచ కట్టుకొని  వచ్చేవారు వాళ్లంటే మాకు ఎంతో భయభక్తులు ఉండేవి మా ఇంటికి దగ్గరలోనే హై స్కూల్ ఫస్ట్ బెల్ కొట్టిన తర్వాత బయలుదేరి వెళ్లే వాళ్ళం  అక్కడ స్కూలు ప్రారంభించిన 12 13 నెలల్లో కొత్తగా మంచినీటి చెరువు వద్ద కొత్త కట్టడంలో ప్రవేశించాం అప్పట్లో కృష్ణయ్య గారు మాకు హెడ్మాస్టర్ గా ఉండేవారు ఆయన రోజు ఫస్టికల్ కొట్టగానే గేటు దగ్గర పేమ్ బెత్తం పట్టుకొని ఎవరు ఆలస్యంగా వచ్చిన వారికి ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉండేవాడు అదృష్టవశాత్తు వారి చేతికి నేనెప్పుడూ దొరకలేదు  ఫస్ట్ ఫామ్ నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు నేనే స్కూల్ లీడర్ ని టీచర్స్  ఆలస్యంగా వచ్చినప్పుడు నేనే అధికారాన్ని చలాయించే వాడిని.
కామెంట్‌లు