ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి అనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 రజనీ గారు 1937 నుంచి 40 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివారు పింగళి లక్ష్మీకాంతం గారు వీరి గురువుగారు దేవుల పల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు వీరికి అత్యంత ఆత్మీయ మిత్రులు  మేము ఎప్పుడైనా రచన దేవులపల్లి అని చెప్తే రజిని గారికి కోపం వచ్చేది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి అన్న పూర్తి పేరు స్పష్టంగా చెప్పమని ఆదేశించేవాడు  1940 లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రాం రేడియో జీవితాన్ని ప్రారంభించారు తర్వాత పదోన్నతులు పొంది దేశంలో అనేక చోట్ల పని చేశారు  పనిచేసిన ప్రతి చోట తెలుగు సంగీత సాహిత్య వెలుగు ధారలను పంచారు.  1976 నుంచి 78 జనవరి వరకు భారతదేశంలో తొలిసారిగా బెంగళూరులో ప్రారంభించిన రేడియో కేంద్రంలో పనిచేశారు  1947 ఆగస్టు 15 భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున  నెహ్రూ ప్రసంగం చేసిన తర్వాత రేడియోలో రజనీ రచించిన గీతమే మాది స్వతంత్ర దేశం హృదయానందంగా  
మారు మ్రోగింది. దానిని తానే స్వర పరిచారు రజని తెలుగు లలిత సంగీత వికాసానికి ఎంతో సేవ చేశారు ఎన్నో గేయనాటకాలు సంగీత రూప కాలు రచించారు ఇతర కవుల గీతాలను కూడా వీరే స్వర పరిచారు చిన్న పిల్లల కోసం జేజి మామయ్య పాటలు రాశారు సినీ గాయకుడుగా కూడా ప్రసిద్ధుడు భానుమతితో కూడా కలిసి  స్వర్గసీమ గృహప్రవేశం లాంటి చిత్రాలకు పాటలు పాడారు ఆయన రచనల్లో శతపత్ర సుందర గీతాలు విశ్వవినా రేడియో నాటకాల సంకలనం ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర జేజి మామయ్య బాల గీతాలు లాంటివి చాలా శ్రేష్టమైనవి  రజినీ గారు మద్రాస్ కేంద్రంలో పనిచేస్తున్నప్పటి నుంచి భానుమతి గారికి పరిచయం ఉండి రజనీ రాసిన ఓహో పావురమా అన్న పాట వల్ల ఆవిడకి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే ఆ పాటను స్వరపరిచింది కూడా రజనీ గారే. ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల వారి పేరు తెర మీద కనపడలేదు ఎస్ రాజేశ్వరరావు గారి పేరే ఉంటుంది మల్లిక్ గారు సినిమాలో ఉన్నారు వారు పాడిన  పాటలకన్నిటికీ హెచ్ఎంవి రికార్డుల మీద కే మల్లికార్జున రావు అని ఉంటుంది ఆ పరీక్ష ఎంతో భానుమతి గారు ఎప్పుడు ఏ పని మీద విజయవాడ వచ్చిన రేడియో కేంద్రం వచ్చి రజిని గారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళేది. పాత స్టూడియోలో ఉన్నప్పుడు ఒకసారి భానుమతి వస్తే లతగారు నన్ను కూడా తీసుకొని రజిని గారి  రూముకి తీసుకొని  లత గారు భానుమతి గారు ఒకరినొకరు ఏమే ఒసేయ్ అని పిలుచుకునే అంత చొరవ ఉన్నవాళ్లు  రజిని గారి మద్రాస్ విషయాలు ముచ్చటించిన తర్వాత చివర్లో గురువుగారు రజినీ గారిని అలాగే పిలుస్తూ  ఉండేది ఆవిడ.
కామెంట్‌లు