మన తిరుపతి వెంకన్న- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రసాదములు దేవస్థానపు సొంతం. ధర్మం ఆర్జితమని మూడవసారిగా ప్రతిరోజు మొదటి గంట రెండవ గంటలకు ఈ మూడు విధముల నివేదన ఉంటుంది కానీ రాత్రి మాత్రం దేవస్థానము సొంతంలో ఖర్చుపడిన నివేదన మాత్రం ఉంటుంది మొదటి గంటకు నివేదనైన త్రివిధ ప్రసాదములతో దేవస్థానపు సొంతమనుకొని  కైంకర్యపరులు మొదలగు వారికి హోదాకి తగినట్లు మర్యాదలు చేయడం గాను దేశాంతర  బ్రాహ్మణాది వినియోగానికి ఖర్చు పెడతారు ధర్మము అంటే ప్రతి దినం కానీ కొన్ని రోజుల్లో కానీ కొందరు సోమవారం ఇచ్చే ప్రసాదములు చేయించి ఆరోగ్యం చేస్తూ ఉంటారు ఇది దేశాంతరాలకు వినియోగం చేయబడుతుంది హైదరాబాద్ పడమర నరసింహారావు బెంగళూరు శ్యామల శ్రీనివాసచార్యులు గారు మైసూరు మహారాజు గారు పుదుకోట రాజుగారు సర్ థామస్ మన్రో దొరగారు ధర్మములు ఉన్నాయి. సర్ థామస్ మన్రో గారి ధర్మం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతాపాన్ని తెలియజేయక మానదు కదా ఆర్థికమనగా యాత్రికులు సొమ్ము దేవస్థానం వారు  పారుపత్యదార్ కచేరిలో చెల్లించి రసీదు తీసుకొని నివేదన చేయించిన ప్రసాదాలు ఇవి ఆరోగ్యం అయిన తర్వాత కళాచార ప్రకారం  కొంచెం ప్రసాదం ఎత్తుకొని తక్కినది యాత్రికులకు ఇస్తూ ఉంటారు  మధ్యాహ్నం రెండు ఒక గంట నివేదనకు దేవస్థానపు సొంత ప్రసాదాలు ఉన్నాయి మొదటి గంటకు నివేదన కానీ ఆర్జిత పదార్ధములు ఉన్నంత  వరకు ఆరగించి  అప్పుడు దీనిని తింటారు రెండవ గంట నివేదన అయిన ఒక గంగాళం చక్కెర పొంగలి దేశాంతరులకు బ్రాహ్మణ వినియోగం చేస్తూ ఉంటారు  రాత్రి గంటకు నివేదన దేవస్థానపు సొంత ప్రసాదం అయినందున కొంతమంది రాత్రి ఇది తప్ప దేశాంతర బ్రాహ్మణులకు పెట్టేటువంటి అనసరాలు మరియు వెంటనే  ఒక చిన్న గంగాళం చక్కర పొంగలి దేశాంతరులకు వినియోగం చేయించబడుతూ ఉంటుంది గురువారం పొలంగి అయిన తర్వాత వాడే పప్పు, పానకమును శుక్రవారం రెండవ గంటలకు పోటీలు వడ పప్పు పానకాలని కూడా ఆరాధిస్తూ ఉంటారు ఆర్జిత ధర్మముల పదార్థములు దేవస్థానము సొంతము వలె త్రికాల నివేదనలో ఎప్పుడైనా ఆరగింపు చేయబడతాయి  స్వామి వారి హుండీలోనే డబ్బులు లెక్కించి పరకామణి యాత్రికులు స్వామివారికి కానుకలు ఎక్కడబడితే అక్కడ ఉంచుతుంటే దానికి ఒక గంగాళం పెట్టి అందులో వేయమన్నారు మహంతులు.


కామెంట్‌లు