మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శ్రీరాముల వారి జన్మ నక్షత్రం పునర్వసు మహంతుల పరిపాలనాకాలంలో అధికారి రామలక్కన్ దాస్ మఠం తోటకు ఆనుకొని ఉన్న వెంకటగిరి రాజా గారి తోటను కొని అభివృద్ధి చేసి అక్కడ ఒక మండపం నిర్మించారు పునర్వశి నక్షత్రం నాడు అక్కడికి ఆలయంలోని శ్రీరామ లక్ష్మణ సీతమ్మ అనుమల ఉత్సవ విగ్రహాలను రక్షించి ఉత్సవం చేసేవాడు అది కాలాంతరంలో వసంతోత్సవంగా మారింది ఈ మండపం కూడా అలాగే పిలువబడింది అప్పుడు ఆ వస్తువు ప్రత్యేకంగా చేయబడుతుంది నిత్యం చేయబడే సహస్ర దీపాలంకార సేవలో పునర్వసులక్షత్ర నాడు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుడు  ఊంజలి సేవలో పాల్గొంటారు  ఇది శ్రీహత్తి రాంజీ మఠం అధికారి  శ్రీరాములక్కన్ దాసు గారు దేవస్థానములో సొమ్ము కట్టినందున శాశ్వతంగా ఉత్సవము జరుగుతూ ఉంటుంది. శ్రీరాముల వారు పడమట వీధిలోని ధర్మకర్త గారు కట్టించిన మండపంలోనికి విజయం చేసి దోశ ఆరగింపు అయిన తర్వాత  మహా ప్రదక్షణముగా గుడిలోనికి విజయం చేయగా రాత్రి తోమాల సేవ మొదలగునవి జరిపిస్తూ ఉంటారు  శ్రీరాముల వారు ఈ ఉత్సవంలో విశేష వస్త్రాభరణాలంకార    భూషితులుగా ఉంటారు చిత్త నక్షత్రం నాడు మైసూర్ మహారాజు వారి జన్మ నక్షత్రం దానిని గద్వాల వారి ద్వాదశి ఉత్సవాల్లో అన్ని ఆలయాల్లోనూ జరిపిస్తారు వసంతోత్సవం మూడు రోజులు జరుగుతుంది మొదట రెండు రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లప్ప స్వామికి చివరి రోజు సీతారామ లక్ష్మణ స్వాములు  రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వాములు కలిసి ముగ్గురు స్వాములకు జరుగుతూ ఉంటుంది ఈ ఉత్సవాన్ని అధికారి రామలక్కన్ దాస్ 1918 ప్రాంతంలో కొత్తగా ప్రారంభించారు. ప్రతినెలకు చిత్తా నక్షత్రమందు శ్రీవారికి మైసూర్ మహారాజు గారిచే సమర్పించబడిన దంతపు పనిచేసిన పాలకీయం ఉత్సవం జరిగి శ్రీవారి రంగ మండపంలో పులిహోర ఆరగింపై ఆస్థానమందు వినియోగం జరుపుకోవడం  కోసం ఒక యాంచాల సమేతమైన ఉత్సవం అనంతరం రాత్రి తోమాల సేవ మొదలగునవి మామూలు ప్రకారం జరుగుతాయి  ద్వాదశి ఉత్సవం శ్రీ మల్లయ్యప్ప స్వామి వారి శ్రీ వేంకటేశ్వర ఉత్సవ వరులు పగలు రెండవ గంట అయిన తర్వాత కొయ్య తిరిగి మహా ప్రదక్షణముగా ఉత్తర పరీక్షలోనున్న శ్రీ గద్వాల్ రాజా గారి ద్వాదశి మండపానికి విజయం చేసి అక్కడ శ్రీ రాజు వారి ఏజెంట్ చేసిన పులిహోర శనగపప్పు నివేదించబడి ఆస్థానమందు వినియోగమవుతుంది ఆ తర్వాత శ్రీవారు దేవస్థానంలోనికి విజయం చేసి రాత్రి తోమాలు సేవా మొదలగునవి పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇది శ్రీ గద్వాల రాజు గారి ధర్మం.


కామెంట్‌లు