విజ్ఞుతతో ఓటేద్దాం సుపరిపాలనకు బాటేద్దాం;- అంకాల సోమయ్య దేవరుప్పుల జనగాం 9640748497
ప్రజల దశదిశమార్చుతామని
నమ్మబలుకు
నయవంచకులు

కొత్తరాగమెత్తుకొని
కొత్త దారి ఎంచుకొని
వీధి వీధి తిరుగుతుండ్రు
విలువైన నీ ఓటుకొరకు
ఇప్పుడు మంచిచెడులు 
యోచించ కుంటే
నిండమునిగేది 
మీరేనని
మరువొద్దు

నోటుకు నాటుకు లొంగొద్దు
బహుమతులు కానుకలకు
అర్రులు చాచొద్దు

నీ ఓటును కొన్నోడు
నిన్ను లెక్కచేయడు

నీ అభివృద్ధిని
నువ్వు కొరుకుంటే 
స్వేచ్ఛగా నీ ఓటు బ్యాలెట్ బాక్సులో వేయి

ఏమార్చువారుంటారు
వారినిలెక్క చేయోద్దు

కులం మతం ప్రాంతం
అంటూ 
మన మన మధ్యన్నే
చిచ్చురాజేస్తరు

మధ్యలో పెద్దమనుషులై
మనకే నీతులు వల్లిస్తారు

ఇన్ని దొంగ విశేషాలన్నింటికి
తమ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతారు

విజ్ఞుల మాట విందాం
విజ్ఞుతతో మన ఓటు వేద్దాం
ప్రజాస్వామ్యానికి బాటేద్దాంకామెంట్‌లు