నిరుపేద అవ్వకు దిక్కెవరు?! ;- - అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
ఉరుము ఉరిమి 
మెరుపు మెరిసి
పిడుగులేపడతే
ఊరిచివరలో కాపురముండే
నిరుపేద అవ్వకు 

//ఎవరు దిక్కు
ఎవరు దిక్కు//

దిక్కవుతాడన్న
ఒక్కగా నొక్కకొడుకు
పెళ్లాం మాటిని
తల్లిని ఎడబాసి
పట్నం వలసపోతే
ఆ నిరుపేద తల్లికి

//ఎవడు దిక్కు
ఎవరు దిక్కు//

ఆకాశానికి తూట్లుపడెనో
ఆ సూర్య భగవానుడు
నిప్పులు కక్కేనో
వరుసవానలు
వడగండ్లవానలు
కరువుకాటకాలు 
సుడులు తిరిగే
గాలి దుమారం
రవ్వగాలికే గుడిసే ఎగిరిపోతే 
ఆ అవ్వబ్రతుకు 
ఎంతనరకం
ఎంత నరకం 

//ఎవరు దిక్కు
ఎవరు దిక్కు//

ఎళ్ళకేళ్ళు 
ఊడిగం చేసెను 
తన కొనుగోలుశక్తితో
దేశ సంపద పెంచెను
ప్రతి ఐదేళ్లకు ఒకసారి
 నోటుకు నాటుకు తనఓటుఅమ్మక
మనస్సాక్షిని నమ్మి 
ఓటేసిన
ఆ అవ్వకు పక్కా యిల్లు యివ్వలేరా?!
ఆ పేదతల్లిమీద
 కాసింత దయజూపలేరా!?

ప్రజల డబ్బుతో విలాసాలు
అనుభవించే 
నేతలారా!?

బడుగు జీవుల భగ్గుమంటే
నిరుపేదలు ఎదురుతిరిగితే
దొంగ నేతలు చెరసాలలో
సేవాతత్పరులు
ప్రజాక్షేత్రంలోకామెంట్‌లు