మహాభినిష్క్రమణం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
ఇంకెంత కాలం
నాయనా
మెడకు వ్రేలాడే
గుదిబండలా
ఈ నిరుద్యోగం

 పోటీ పరీక్షల పుస్తకం
ముందేసుకుని చదువుతుంటే
అమ్మానాన్న కష్టం గుర్తొచ్చి
గుండె చెరువై 
కన్నీటితో పుస్తకమంతా తడిసే


రాజ్యం 
మా బ్రతుకులతో దోబూచులాటాడుతుంది
వారి ఎన్నికలకు వారి గెలుపుకు
మా నౌకర్లను ముడి పెట్టింది

గంపెడు ఆకలిగొన్న
అన్నార్తులకు
పిడికెడు మెతుకులేసినట్టు
నిరసన నిప్పు మీద
నీళ్లు చల్లినట్టు
సావుగింజల్ని
పొలంలో జల్లినట్టు
ఈ ఉద్యోగ ఖాళీలు

ఈ భూమ్మీద
 బ్రతకలేం
ఇక్కడ బ్రతకడమంటే
నిత్యం పస్తులతో
 సహవాసం చేయడమే

ఈ ఆకలి కేకలకు
నాలోఉత్పన్నమయ్యే
ప్రశ్నల పరంపరకు
శాశ్వత పరిష్కారం
ఒక్కటే
అదే మహాభినిష్క్రమణం
పరమపదించడం
దీర్ఘ నిద్రలోకీవెళ్లడం
తుది శ్వాస విడవడం
ఇన్ని పర్యాయపదాలెందుకు
చచ్చిపోవడంకామెంట్‌లు