ఎండలు ఎండలు ఎండలుమాడులు మండే ఎండలు;- అంకాల సోమయ్య దేవరుప్పుల జనగాం9640748497
ఎండలు ఎండలు ఎండలు 
మాడులు మండే ఎండలు
ఊపిరాడక ఉక్కపోతతో
ఉసురుదీయుఎండలు

ఎవని పాపమీ ఎండలు
ప్రకృతే పగబూనెనా!
నిప్పులవానైకురిసెనా!
వడగాలే వడిసెలరాయై
నిట్టనిలువుగా నినుగూల్చెనా!

చెట్టు పుట్ట గుట్టల మ్రింగితిమి
కూర్చున్న కొమ్మనే నరుక్కుంటిమి
ప్రాణవాయువు మనకందక
ప్రాణాలు గాల్లో గలిసెను

అడుగడుగునా కాంక్రీట్ జంగల్స్
మన సుఖసౌఖ్యమని మురిసిపోతిమి
భూతాపం పెరిగిపోయెను
భూగర్భజలాలు అడుగంటెను
కరువుకాటకాల విలయతాండవం
సకల మానవాళి మనుగడే
ప్రశ్నార్థకం 

భవిష్యత్తంతా నిరాశాజనకమే
సహజత్వం మరిచి అసహజత్వమై
అంతులేని జబ్బులతో బాధపడే నేటితరం

ఇకనైనా మారుదాం
ఇంటింటా చెట్లు నాటుదాం
ఖాళీ స్థలాల్లో సామాజిక అడవుల పెంపకం చేపడదాం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
చెట్లుంటే క్షేమం లేకుంటే క్షామం
అని ఎలుగెత్తి చాటుదాంకామెంట్‌లు