=🚩దుష్టబుద్ధి కలవాడు
శత్రువైన, మిత్రుడైన
ఒక్కటే! తస్మాత్ జాగ్రత్త!
వినండి! విబుధులార!
( అష్టాక్షరీ గీతి , శంకర ప్రియ.,)
👌దుర్జనులనగా దుష్టబుద్ధి కలవారు! వారితో వైరము కూడదు! స్నేహము పనికిరాదు! ఎందువలననగా, బొగ్గులు చల్లగా నల్లగా నున్నప్పుడు; తాకితే చేతులను మసిచేస్తాయి. వేడిగా, నిప్పుతో నున్నప్పుడు; తాకితే చేతులు కాలిపోతాయి. అందువలన, దుర్మార్గులకు దూరముగా ఉంటేనే మంచిది! తస్మాత్ జాగ్రత్త!
🪷దుర్జనేన సమం వైరం
ప్రీతిం చాపి న కారయేత్!
ఉష్ణో దహతి చాంగారః
శీతః కృష్ణాయతే కరమ్!
(....ఇది సుభాషిత రత్నము! అనగా మంచిమాట!)
🚩తేట గీతి పద్యము
దుర్జనులతోడ మైత్రియు తుదకు పగయు
కూడదెన్నడు, సుజనులు కోర వలదు
చల్లగానుండు బొగ్గులే జ్వాలి గనిన
హస్తముల గాల్చు, తాకినన్, హాని చేయు!
(జ్వాలి అనగా అగ్ని)
[ రచన:- డా. శాస్త్రుల రఘుపతి.,]
**************
🚩తేటగీతి పద్యం
దుర్జనులతో విరోధంబు, తుదకు మైత్రి
చేయకూడదు, చేసినన్ చేటుకలుగు
మాడుబొగ్గును ముట్టినన్, మసినిచేయు
కాంతి నిప్పును తాకినన్ కాలు చేయి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి