పండుగ ఓటు;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
చిన్నతనంలో ఊరు ఊరంతా 
చేరేది చెరువు తొవ్వకు
పూసిన జమ్మిచెట్టుదే పొలిమేరల నడక

ఒక బతుకమ్మ  ఒక దసరా
సంబర కోలాహలం
ప్రతి పిల్లాజెల్లలదే ఆటపాట

సమ్మక్క సారక్కల సాహస కవాతు
గిరిజన ఆదివాసీల ద్వైవార్షిక పండుగ
మొక్కవోని ధైర్యం ప్రపంచ వాకిట

పరుగెత్తే నదీగీతం ప్రజాస్వామ్యం 
నిలిచే జ్ఞానసేతు పచ్చని చెట్టు ఓటు 
పండుగైన పౌరస్వేచ్ఛ దేశప్రజలకోసం


కామెంట్‌లు