ఓటు హక్కు విలువ(అష్టాక్షరీ గీతికలు) కవిమిత్ర, శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
   భారత రాజ్యాంగ మందు
ప్రాథమిక హక్కు "ఓటు"!
    ప్రాముఖ్యమైనది "ఓటు"!
 ఓటుహక్కు పౌరులార! (1)     
    ఐదేళ్లకు ఒక్కసారి
సువర్ణావకాశ మిది! 
    సద్వినియోగం చేయండి!
ఓటుహక్కు పౌరులార! (2)
 
   ఉచితముల కొరకు
ఆశపడవద్దు మీరు
    అప్పుల పాలగుదురు  
 ఓటుహక్కు పౌరులార! (3)
     
    దేశ భద్రత కొరకు
సుపరిపాలన ముద్దు!
     సంకల్పము కావించండి!
ఓటుహక్కు పౌరులార! (4) 
    ప్రజలే పాలకులైన
ప్రజాస్వామ్యమే మనది! 
    ఓటు వేయాలి మనము  
 ఓటుహక్కు పౌరులార! (5)
             
   మనమందరం కలిసి
ఐకమత్యంగా నుండాలి!
   అందరి క్షేమం కోరాలి!  
ఓటుహక్కుపౌరులార! (6)
   🚩 జయజయ భారత మాత!

కామెంట్‌లు