"ఓటు" వేయాలి;- కవిమిత్ర, శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
   🔆 మనరాష్ట్ర ప్రగతికి
దేశ సంక్షేమమునకు
     "ఓటు" వేయాలి మనము!
 ఓటర్ మహాశయులార!
    (... అష్టాక్షరీ గీతి , శంకర ప్రియ.,)
👌"ఓటు హక్కు ... ఎంతో విలువైనది! మన భారత రాజ్యాంగము నందు భారతీయులందరికీ... ప్రాథమిక హక్కు! దీనిని సద్వినియోగించాలి! ప్రజా స్వామ్యమును పరిరక్షించు కోవాలి!
 👌ఓటు.. ఒక పచ్చనోటుకు పరిమితం కారాదు! మందువిందుకు బానిస కాకూడదు! మనమంతా..  మనరాష్ట్రం, మనదేశం..  పురోభివృద్ధికి మాత్రమే "ఓటు" వేయాలి! ఓటరు మహాశయులార! తస్మాత్ జాగ్రత్త,!
      🚩ఆటవెలది పద్యం
   ఓట్ల నడుగు కొరకు నోట్లను పంచగా
   వచ్చు మూర్ఖులార! భ్రష్టులార!
    ఓట్లనమ్ము కొనుచు ఊడిగమ్ములు చేయు
    పాట్లువద్దు మీరు వచ్చుటొద్దు!
(.... డా. శాస్త్రుల రఘుపతి., )
      ***************
       🚩ఆటవెలది పద్యం 
   అయ్య! ఓట్లు నిచట నమ్మకానికి లేవు!
   నోట్లనిచ్చి కొనగ నోట్లు లేవు! 
   కొంటెగాళ్ళు మాదు ఇంటికి రావద్దు!
   నీతిలేని యట్టి నేతలార!
        [...విద్వాన్ పైడి హరనాథ రావు.,[

కామెంట్‌లు