అర్చనా సమయమందు...;-కవిమిత్ర, శంకర ప్రియ , శీల ,-సంచార వాణి:- 99127 67098
 🪷అర్చనా సమయమందు
 ఇష్టదైవ మూర్తులను
   భక్తితో సేవించెదము 
సాంబశివ! నమఃశివా!
🪷స్తోత్ర పారాయణమందు
శబ్ద పరoబ్రహ్మమును
   రక్తితో కీర్తించెదము 
సాంబశివ! నమఃశివా!
      [ అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,]    
 👌పరమేశ్వరుడే భక్త వత్సలుడు! భక్తులందరి యందు పుత్రవాత్సల్యమును కలిగియున్నాడు! ఆ భగవానుని  సేవించుటకు ... భక్తిమార్గములలో  "అర్చనము" మరియు  "కీర్తనము".. ప్రధానమైనవి! అందువలన, భక్తిశ్రద్ధలతో షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైన పరమేశ్వరుని; చేతులార పూజించుచున్నాము! నోరార కీర్తించుచున్నాము!
👌అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, పరమేశ్వరుడు... పలువిధములైన అర్చామూర్తుల యందు కొలువైయున్నారు! అట్లే, శబ్దప్రధానము లైన...స్తోత్ర పారాయణము లందు, మరియు మంత్రముల అనుష్టానము లందు నెలకొనియున్నారు! కనుక, మనమంతా పరమేశ్వరుని  భక్తిప్రపత్తులతో  సేవించుచున్నాము!
⚜️అర్చనకాలే రూపగతా
      సంస్తుతికాలే శబ్దగతా 
...అని, సుభాషితరత్నము పేర్కొనుచున్నది!
       🚩తేట గీతి పద్యము 
    సర్వ సాక్షిని అర్చించు సమయమందు
    రూపమొప్పెడు, స్తోత్ర విలోకమందు
    పదములున్, ధ్యాన మందున ప్రాణములును;
    తత్త్వమున పర రూపముం దలప వలయు!
       ( రచన:- డా. శాస్త్రుల రఘుపతి.,)

కామెంట్‌లు