తల్లిదండ్రుల హితోపదేశం- కవిమిత్ర, శంకర ప్రియ., శీల., -సంచార వాణి:- 99127 67098
 👌తల్లిదండ్రులు పేర్కొను 
 హితోపదేశం నెపుడు
   తప్పకుండా వినరండి!
 ఈతరం వారసులార!
👌భారతీయ స్త్రీజాతికి
  సాధ్వీమతల్లి సీతమ్మ
     ఆదర్శ మహిళాశక్తి
  ఈతరం వారసులార!
       (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🚩 సీతాదేవి రాముని ధర్మపత్ని! దశరథమహారాజు పెద్దకోడలు! జనకచక్రవర్తి ప్రియపుత్రిక! అవనిజాత.. జానకీమాత! ఆమెకు బాల్యమునందు, యుక్తవయస్సు నందు... సనాతనధర్మము నందలి మర్మములు, సాంఘికమైన కట్టుబాటులు, సంప్రదాయములు... మున్నగవాటి గురించి; తల్లిదండ్రులు పేర్కొన్నారు!
 🪷పుట్టింటిలో తల్లిదండ్రులు కావించిన "హితోపదేశములు"..  జానకీదేవిలో ధార్మిక ప్రవర్తనకు దోహదం చేశాయి! మరొకరి అవసరము లేకుండా, స్థిరమైన నిశ్చయబుద్ధిని పెంపొందించాయి! విభిన్న పరిస్థితుల్లో అద్వితీయమైన జ్ఞానముతో ప్రవర్తించుటకు కారణమయ్యాయి!
🚩అనుశిష్టా చ మాతృచ
 పితృచ వివిధాశ్రయమ్!
    నాస్తి సంప్రతి వక్తవ్యా
 వర్తితవ్యం యథామయా!!
      ( శ్రీమద్రామాయణం, సుభాషితం.,)
       "స్వామి! నాయొక్క  తల్లిదండ్రులు అనేక విషయములను గూర్చి;  నాకు పూర్వమే చెప్పియున్నారు. నా ప్రవర్తన విషయంలో... ఒకరి ప్రమేయం అవసరం లేకుండానే, నేను ప్రవర్తించ గలను", అని, సీతాదేవి... ధర్మస్వరూపుడు, పతియైన రామునితో పలికింది! ఇందులో.. భారతజాతి "స్త్రీ వైభవము" సాక్షాత్కరించు చున్నది! శుభమస్తు!
        🚩తేట గీతి పద్యం
   స్వామి! రఘువరా! నాదైన బాల్యమందె
   తల్లిదండ్రులు బోధింప "ధర్మ నిరతి"
   నెఱిగి యుంటిని! గావున, నెవరివలన
   నేర్చుకొన నెన్ననెప్పుడు "నీతి పథము"
        [ రచన:- డా. శాస్త్రుల రఘుపతి. ]
                 🔆🌻🔆
🚩తేటగీతి పద్యం 
   స్వామి! నా తల్లిదండ్రులు జగతి యందు 
   నడువ నాకు "ప్రవర్తన" నుడివినారు
   కాన, వేరొకరి "ప్రమేయ మేను" గొనగ
   నవసరము లేదనియు బల్కె నవనిజాత!
      [ తెలుగు సేత:- విద్వాన్ పైడి హరనాథ రావు.,]

కామెంట్‌లు