పార్వతీమాత తపోదీక్ష- కవిమిత్ర, శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
 🔱శ్రీమత్ పరమేశ్వరుని
అర్ధభాగం పొందుటకు
    తపోదీక్ష ప్రారంభించె
 హైమవతి! నమఃశివ! (1)
🔱కఠిన నియమాలతో
సదాశివుని సేవించె!
   సుకుమారి "ఉ మా" దేవి
సాంబదేవ! నమఃశివ! (2)
      ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,
⚜️శ్రీమాత.. దక్షప్రజాపతి పుత్రికగా అవతరించింది! "సతీ దేవి"గా పరమశివుని ఇల్లాలుగా ప్రఖ్యాతి గాంచినది. తరువాత, కొన్ని కారణముల వలన దక్షయజ్ఞం నందు దేహత్యాగం చేసింది.. దాక్షాయణి!
        సతీదేవి.. హిమవత్ పర్వతరాజు పుత్రికగా ఆవిర్భవించింది! అందువలన, "పార్వతి" అనిపేరు! ఆ శైలజా కుమారి.. పరమేశ్వరుని పతిగా పొందుటకు; "తపోదీక్ష" ప్రారంభించింది!
🔱ఆధ్యాత్మిక సాధనలో ...విభూతిని, రుద్రాక్షలను దాల్చినది! భౌతిక సుఖములను విడిచిపెట్టింది! ఏకాగ్రతతో, అకుంఠిత దీక్ష చేపట్టింది! నిరంతరం శివార్చనము, శివనామ స్మరణము, శివపంచాక్షరీ మంత్రజపం కావించు చున్నది! ఆ విధంగా తపోదీక్షను భక్తిప్రపత్తులతో కొనసాగించు చున్నది, ఉమాదేవి! 
       🚩 సీస పద్యము
అన్నపానాదుల నారగించుటమాని
    ఆకులలముల దా నారగించె
మృదువైన శయ్యల మేనువాల్చెడు దల్లి
    నిద్రించె శిలలపై నీమముగను
పరిమళ ద్రవ్యాల వాడుక మరచియు
   చన్నీటి స్నానాలు సలుప సాగె
పరమశివుని సేవ పరమధర్మ మనుచు
    నిటలాక్షు సేవించె నెమ్మితోడ
       🚩తే.గీ.
భవునిరూపము మదిలోన పదిలపరచి
   పూవులాకులు ఫలములు బూజకొరకు
వస్తుసంచయముల దెచ్చు భద్రముగను 
   హరుని జేబట్ట నెంచగ నంబ యపుడు!.
       [ రచన:- యం. వి. వి. యస్. శాస్త్రి.,]

కామెంట్‌లు