మూర్ఖాగ్రేసరుల లక్షణములు- కవిమిత్ర, శంకరప్రియ , శీల ,-సంచార వాణి:- 99127 67098
 ⚜️ఐదు దుర్లక్షణములు
కల్గియుందురు, భువిని
    మూర్ఖాగ్రేసరు లెపుడు
తెలుసుకో! ఓ సుమతీ!
     ( అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)  
👌"మూర్ఖులు" అనగా అన్నీ తెలుసు ననుకొనే వారు! తెలివి తక్కువ వారు! వారు.. కొన్ని అవలక్షణములతో వ్యవహరిస్తారు! అవి....
1) గర్వం ఎక్కువగా వుండడం
2) చెడ్డమాటలు మాట్లాడే స్వభావం
3) మొండి పట్టుదలగా  నుండడం
4) అప్రియంగా మాట్లాడడం, వాదించడం
5) ఎదుటివాళ్ళు చెప్పిన దానిని వ్యతిరేకించడం, వారి మాటలను కాదనడమే లక్ష్యంగా పెట్టుకోవడం 
👌ఈ విధంగా.. ఐదు లక్షణములు కలిగి యున్నవారే  "మూర్ఖాగ్రేసరులు"! అటువంటి వారికి దూరంగా నుండవలెనని "శాస్త్ర వచనము" పేర్కొను చున్నది!
🚩మూర్ఖస్య పంచ చిహ్నాని
     గర్వీ దుర్వచనీ తథా
     హరీ చాఽప్రియవాదీ చ
     పరోక్తం నైవ మన్యతే !!
          ( ..సుభాషిత రత్నావళి., )
        🚩తేట గీతి పద్యం
నన్ను మించిన వాడు లేడన్న పొగరు
మొండిగా మెలగుచు నెప్డు, మూర్ఖములగు
మాటల చేతల నితరుల మనములకును
బాధ కలిగించు, దుష్టుల  వదల వలయు!
        [ తెలుగు సేత:- డా. శాస్త్రుల రఘుపతి.,]
    *******************
          🚩తేట గీతి పద్యం 
పరుషములు పల్కుటయు, మొండి పట్టుదలను,
వాదనంబును గర్వమున్, వదరుబోతు,
నప్రియంబుగ మాట్లాడు నట్టి గుణము 
మూర్ఖుడీ యైదు లక్షణముల వెలంగు !
        [ తెలుగు సేత:-  విద్వాన్, పైడి హరనాథ రావు.]

కామెంట్‌లు