త్రికాలజ్ఞాని - వీరబ్రహ్మేంద్రస్వామి;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్:-విశాఖపట్నం9963265762.
ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యుల  వరప్రసాదిగా
కాశీవిశ్వేశ్వరానుగ్రహంచే 
సరస్వతీ నదీ తీరాన
కార్తీక శుద్ధ ద్వాదశి  నాడు
జన్మించిన మహానీయులు
వీరబ్రహ్మేంద్రస్వామి.

కంది మల్లయ్య గ్రామంలో
పశువుల కాపరి నుంచి పరమాత్మతత్వంను వివరించిన  సిద్ధపురుషులు.
పితృదేవుని నిర్యాణం తో
మాతృమూర్తి ఆధ్యాత్మిక ఉపదేశంతో
ధ్యానయోగం ద్వారా ఆత్మ పరమాత్మల గురించి
కులమత బేధాలు చూపక
జగతిన ఉన్న ప్రజలంతా పరమేశ్వర ప్రతిరూపాలని
ఆనాడే సహ పంక్తి భోజనాలను ఏర్పరిచిన సంఘ సంస్కర్త.

వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం 
రాబోయే సంఘటనలకు ప్రామాణికం
బ్రహ్మం గారి మహిమను పరీక్ష దలచి
మాంసాహార విందుని ఏర్పాటు చేసిన నవాబుకు
యోగసిద్ధితో పుష్మములు గా మార్చుట చూసి డెబ్బది ఎకరాలను దానం చేసెను
 
వైవాహిక జీవితంలో అర్ధాంగి గోవిందమ్మ ద్వారా
నలుగురు బిడ్డలకు తండ్రయిన 
బంధాలకతీతమైనది పరమాత్మ తత్వమని
విధిని ఎదురించుట సాధ్యం ఎవరికీ కాదని
ఎందరో శిష్యులకు జ్ఞానబోధ చేసి
రాబోయే రోజులలో జరిగే సంఘటనలను
తత్వాల ద్వారా, కాలజ్ఞానం లో తెలిపిన
త్రికాలజ్ఞులు వీరబ్రహ్మేంద్రస్వామి.

వైశాఖ శుద్ధ దశమి నాడు జీవ సమాధిని పొందిన సిద్ధపురుషులు.
వారు సదా స్మరణీయులు
వారి పాదపద్మములకు సమర్పిస్తున్న నా అక్షరకుసుమాలు...!!
.......................


కామెంట్‌లు