ఆశల పందిరినౌతా!;- -గద్వాల సోమన్న,9966414580
పసి పిల్లల కళ్ళల్లో
కాంతినై ఉదయిస్తా!
కన్నవారి గుండెల్లో
శాంతినై ప్రవహిస్తా!

చిన్నారుల మోముల్లో
చిరు నవ్వై  కన్పిస్తా!
తల్లిదండ్రుల మనసుల్లో
ప్రేమ నదినై పయనిస్తా!

విద్యార్థుల బ్రతుకుల్లో
వెలుగులే పంచేస్తా!
జన్మదాతలఆశల్లో
ఊపిరిలే ఊదేస్తా!

పసి కూనల ఊహల్లో
మెరుపునై మెరిసేస్తా!
వారి తీపి పలుకుల్లో
చిలుకనై జీవిస్తా!


కామెంట్‌లు