పసి పిల్లలలోన...;- -గద్వాల సోమన్న,9966414580
పసివారి నవ్వులలోన
కురిచేను పువ్వుల వాన
లేలేత గుండెలలోన
పొంగేను వెన్నెల సోన

ముత్యాల మాటలలోన
సత్యాల తోటలలోన
ప్రేమానురాగాలే
విరిసేను పిల్లలలోన

అందాల నడకలలోన
మందార తలపులలోన
అందెల రవళులు  గాంచుము
కనువిందే అందులోన

శుచియైన మనసులలోన
రుచి గల కబుర్లులోన
అమృతమ్ము ప్రహించును
ఆనందం ఉదయించును


కామెంట్‌లు