బుచ్చయ్య రామచిలుక స్నేహం;-కె. ఉషశ్రీ.- 9వ తరగతిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల
 అనగనగా ఒక ఊరిలో బుచ్చయ్య మరియు రామచిలుక ఉండేవారు. బుచ్చయ్యకు రామచిలుక అంటే చాలా ఇష్టం. ఒకరోజు బుచ్చయ్య రామచిలుకకు జామ పండు తెచ్చి ఇచ్చాడు. రామచిలుక అతని భుజం మీద వాలి ధన్యవాదాలు చెప్పింది. బుచ్చయ్యకు రామచిలుక మాత్రమే ఉంది. పిల్లలు భార్య అనే వారు ఎవ్వరూ లేరు. బుచ్చయ్య ఒకరోజు పొలం పనులకు బావి దగ్గరికి వెళ్తాడు. పొలం పనులు చేసి ఇంటికి వస్తుండగా రామచిలుకకు జామ పండు తెస్తారు. మరుసటి రోజు రామచిలుక బుచ్చయ్య కోసం ఎదురుచూస్తుంది. బుచ్చయ్య మళ్ళీ రామచిలుకకు జామపండు తెచ్చిండు. అదేవిధంగా వారి జీవితం కొనసాగుతోంది. ఒకరోజు  బుచ్చయ్యకు జ్వరం వచ్చింది. రామచిలుక చాలా బాధపడుతుంది. రామచిలుక బుచ్చయ్యకు మందులు భోజనం పెట్టి జ్వరం నయం చేసింది. తరువాత రోజు బుచ్చయ్య రామచిలుక అలా సరదాగా బయటకు వెళ్తారు. పాపం బస్సు కిందపడి రామచిలుక చనిపోయింది. బుచ్చయ్య చాలా బాధపడ్డాడు. కొద్ది రోజులకు భోజనం చెయ్యక ఆరోగ్యం పాడైపోయింది. అలా బుచ్చయ్య బాధగా చనిపోయాడు.
నీతి, మనం మూగజీవాలను ప్రేమగా చూసుకోవాలి. అవి మనల్ని ఇష్టపడుతాయి. ప్రేమగా చూసుకునే పక్షులు చనిపోతే ఆ బాధ చాలా ఉంటుంది. బుచ్చయ్య తాను పెంచుకున్న పక్షి దూరం అయినందుకు అతడు ప్రాణాలు విడిచాడు.

కామెంట్‌లు