రాజమ్మ కష్టాలు;-కె. ఉషశ్రీ. - 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరూ భార్యాభర్తలు ఉండేవారు. రాములు మంగమ్మ కు ఒక అత్త ఉన్నది. రాజమ్మ అనే ముసలి ఆమె. రాములు మంగమ్మ ఇద్దరూ కలిసి పొలం పనులకు వెళ్తారు. రాజమ్మకు భోజనం పెట్టరు. తిడుతారు, కొడుతారు, వాళ్లు మాత్రం మంచి రకరకాల వంటలు తింటారు. కానీ రాజమ్మకు చద్ది పెడతారు. రాజమ్మ బాగా దిగులుగా ఏడుస్తుంది. అన్నం సరిగ్గా తినక ఆరోగ్యం క్షీణించింది. రాజమ్మ మంచం మీద నుండి లేవకుండా అయిపోయింది. కొన్ని రోజులకు రాజమ్మ చనిపోయింది. రాములు మంగమ్మ సంతోషంగా ఉన్నారు. మీ అమ్మ పీడ వదిలింది అని మంగమ్మ రాములుతో అంటుంది. మంచిగా తింటూ తాగుతూ బాగా సంతోషంగా రాములు మంగమ్మ ఉన్నారు. వారు పొలం పనులు చేస్తలేరు. ఇంట్లోనే ఉంటున్నారు. వారు ఒక రోజు పక్క ఊరికి పోతుండగా ఒక కారు వచ్చి రాములుని, మంగమ్మని గుద్ధి
వేసి పోయింది.
నీతి, కన్నతల్లి ని చంపడం పాపం. వారు చేసిన పనికి ఆ దేవుడు శిక్షించాడు. రాములు, మంగమ్మ, చేసిన తప్పు ఎవ్వరు చెయ్యవద్దు. ఆ దేవుడే రాములు, మంగమ్మ చావు ద్వారా చెప్పాడు.

కామెంట్‌లు