వికసిత భారత్ కవిత.ల- కొల్తూరు సింధు. 9వ తరగతి. జడ్.పి.హెచ్.ఎస్ నిర్మల-జిల్లా జనగాం.
చేయి చేయి కలుపుదాం.
 వికసిత భారత్ చేద్దాం.

 నీతి నిజాయితీ పెంపొందిద్దాం.
 భారతదేశాన్ని అభివృద్ధి పదం లో నడుపుదాం.

 డబ్బుకు ఆశపడకండి.
 అమ్మలాంటి దేశాన్ని అమ్ముకోకండి.

 ఇంకుడు గుంతలు తోవుదాం.
 నీటి నిలువ తెలియజేద్దాం.

 మనిషికి కూడు గుడ్డ ఎంత అవసరమో.
 దేశాన్ని కాపాడుకోవడం అంతే అవసరం.

 చెట్లను పెంచుదాం.
 భారతదేశాన్ని పచ్చదనంతో నింపుదాం.

 విద్యుత్ ని పొదుపు చేద్దాం.
 దేశానికి వెలుగులు పంచుదాం.

 మంచి చదువు చదువుదాం.
 భవిష్యత్తులో భారతదేశానికి ఉపయోగపడుదాం.

 సంస్కృతి సాంప్రదాయం మర్చిపోకండి.
 భారతదేశం పేరు నిలబెట్టడానికి ప్రయత్నించండి.

 ఒడుదుడు గులను  దాటిద్దాం.
 భారతదేశాన్ని ముందుకు నడిపిద్దాం.

 యంత్రాలను పెంచుదాం.
 దేశాన్ని మెరుగుపరుద్దాం.

 మోడ్రన్ డ్రెస్సులు అంటూ పోకు.
 చీర కట్టు పద్ధతిని మరువకు.

 కన్న ప్రేమను మరువకండి.
 మాతృదేశ మమకారం వదలకండి.

 ఇతర దేశ  శేట్టు  పాయింటు పద్ధతిని మలుపుదాం.
 భారతదేశ పంచకట్టు సాంప్రదాయాన్ని తెలియజేద్దాం

 దేశం అంటే మట్టి కాదు.
 దేశం అంటే మనుషులు అని చాటుదాం.

కామెంట్‌లు