తిష్ఠవేసినకవిత;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అందం
పిలుస్తుంది
ఆనందం
ఇస్తానంటుంది

సుమాలను
చూపిస్తానంటుంది
పరిమళాలను
చల్లుతానంటుంది

జాబిలిని
కనమంటుంది
వెన్నెలని
ఆస్వాదించమంటుంది

ఆకాశానికి
ఎగరమంటుంది
మబ్బులనెక్కి
స్వారీచేయమంటుంది

తారలతో
ఆడమంటుంది
తళతళలతో
మెరిసిపొమ్మంటుంది

సముద్రం
స్వాగతిస్తుంది
అలలపై
తేలమంటుంది

కవిత
కవ్విస్తుంది
కలము
పట్టిస్తుంది

ఊహలు
ఊరిస్తుంది
పదాలు
పారిస్తుంది

కాగితం
నింపించింది
కవిత్వం
పుట్టించింది

వర్ధమానకవిని
విస్తుపరచింది
అందాలకైతని
ఆవిష్కరింపజేసింది

పాఠకులను
చదివించింది
పరవశాలను
చేకూర్చింది

మనసులలో
మాటేసింది
తలలలో
తిష్ఠవేసింది


కామెంట్‌లు