జనకమహారాజు! అచ్యుతుని రాజ్యశ్రీ

 సీతాదేవి నరకాంత‌ కాదు మాయా స్వరూపిణి అమ్మ వారు అని గ్రహించి తరించినవాడు మిథిలానగరపాలకుడు జనకమహారాజు.దశరథుని వియ్యంకుడు రాముని మామగారు.జనకునికి నేలలో పెట్టెలో కన్పడింది చిన్నారి శిశువు.సీత అన్న పేరుతో బైటికి వచ్చింది.జనకుడు పెట్టలేదు ఆపేరు.జనకుని కూతురు గా జానకి ఐంది.రావణుని చంపటానికి వచ్చిన జగన్మాత.సీతను వరించి భరించగలవాడు నరుని రూపంలోనే వస్తాడు అనే విషయం జనకునికి తెలుసు.అదే విశ్వామిత్రుడి తో‌అంటాడు" హే బ్రహ్మన్! శివధనస్సు మాఇంట న్యాసంగా ఉంది.దాన్ని ఎక్కుపెట్టిన వాడికే జానకిని ఇస్తాను" అని అంటాడు.ఎంతోమంది రాజులు వచ్చి ధనుస్సు ఎత్తలేక అవమానం తో కలిసి కట్టుగా జనకుని పైకి యుద్ధానికి వచ్చారు.ఆయన కోటలోనే ఉండి యుద్ధం చేస్తున్నాడు.ఆఖరికి తిండి గింజలు కూడా ఐపోతే తపస్సు చేశాడు.అప్పుడు దేవగణాలు జనకుని పక్షాన పోరాడి రాజుల్ని ఓడించారు.ఈవిషయం జనకుడు విశ్వామిత్రుడికి చెప్పి " మీతో వచ్చిన ఆపిల్లల కి అసాధ్యం" అంటాడు.ఒకసారి తెప్పించి చూపాలని జనకుడు తలవటంతో 5వేలమంది బలంగా ఉన్న సైనికులు ధనుస్సు ఉన్న మంజూష ( పెట్టె) ను తోసుకుంటూ తెచ్చారు.దానికి 8చక్రాలున్నాయి.రాముడు కుతూహలం గా విశ్వామిత్రుని అడిగాడు " ఆధనుస్సుని ఒక్క సారి ముట్టుకుని చూస్తాను." ఆయన కనుసైగతో ముట్టుకుని చేత్తో పట్టుకొని ఎక్కుపెట్టాడు.అది ఫటాల్న విరిగింది.రామ లక్ష్మణ జనక విశ్వామిత్రుడు తప్ప అంతా మూర్ఛపోయారు.రాముడు నరుడి రూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం అని గ్రహించి దశరథుడికి కబురంపాడు." మానాన్న అనుమతిలేకుండా నేను పెళ్ళి చేసుకోను.పెళ్లికోసం ధనుస్సు విరవలేదు" అన్నాడు రాముడు.'" ఇయం సీతా మమసుతా" అని కన్యాదానం చేశాడు.పెళ్లికి దశరథుని భార్యలు రాలేదు.కోడళ్లను అయోధ్యకు వచ్చిన తర్వాత చూశారు.శ్రీరామనవమి రోజు కల్యాణం తర్వాత రామపట్టాభిషేకం చేసి మకుటధారణసర్గ చదువుతారు.ఇలా అంతరార్థంతో దైవ స్మరణ తో నిండినది రామాయణం 🌷
కామెంట్‌లు