గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అడుగో ఆధునికకవి! అవిగో అతనిభావాలు!

కవికోకిల
అవుదామనుకుంటున్నాడోయ్
గాంధర్వగానమును
ఆలపించాలనుకుంటున్నాడోయ్

గొంతును
సవరించాలనుకుంటున్నాడోయ్
నోరును
తెరవాలనుకుంటున్నాడోయ్

పెదవులను
విప్పాలనుకుంటున్నాడోయ్
తియ్యదనాలను
చల్లాలనుకుంటున్నాడోయ్

వీనులకు
విందునివ్వాలనుకుంటున్నాడోయ్
ప్రేక్షకులను
ప్రమోదపరచాలనుకుంటున్నాడోయ్

ఆనందమును
అందించాలనుకుంటున్నాడోయ్
అంతరంగాలను
ఆకర్షించాలనుకుంటున్నాడోయ్

ముచ్చట్లు
చెప్పాలనుకుంటున్నాడోయ్
చప్పట్లు
కొట్టించాలనుకుంటున్నాడోయ్

శ్రావ్యత
చేకుర్చాలనుకుంటున్నాడోయ్
నవ్యత
తెలియజేయాలనుకుంటున్నాడోయ్

కైతలను
గానంచేయాలనుకుంటున్నాడోయ్
శ్రోతలను
కట్టిపడవేయాలనుకుంటున్నాడోయ్

నవ్వులు
చిందాలనుకుంటున్నాడోయ్
మోములు
వెలిగించాలనుకుంటున్నాడోయ్

అమృతజల్లులలో
తడపాలనుకుంటున్నాడోయ్
ఆనందడోలికలలో
ముంచాలనుకుంటున్నాడోయ్

గుండెతో
శ్రుతినికలపాలనుకుంటున్నాడోయ్
జీవనగానంతో
ప్రీతినిపంచాలనుకుంటున్నాడోయ్


కామెంట్‌లు