శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
736)భక్తవత్సః -

భక్తులపైన వాత్సల్యమున్నవాడు 
ఆదరణ చూపించుచున్నవాడు 
తండ్రివలే గమనించుచున్నవాడు 
భక్తవత్సలుడు అయినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
737) సువర్ణ వర్ణః -

బంగారువంటి మేనిఛాయవాడు 
దివ్యదేహము యున్నట్టివాడు 
స్వర్ణతేజము ఆవరించువాడు 
సువర్ణఛాయా మాత్రుడైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
738)హేమాంగః -

పసిడివన్నె అంగములవాడు 
బంగారువంటి శరీరమున్నవాడు 
పునీతమైన అంగములున్నవాడు 
స్వర్ణకవచము గలిగినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా
739)వరంగః -

గొప్పవైన అంగములున్నవాడు 
ఆజానుబాహుడుగా నున్నవాడు 
భక్తులకు ప్రియమైన మేనువాడు 
శ్రేష్ఠమైనట్టి అంగములవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
740)చందనాంగదీ -

చందనము అలదుకున్నట్టివాడు 
ఆహ్లాదము కలిగించుచున్నవాడు 
కేయూరములను ధరించినవాడు 
అంగములకు గంధమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు