మరుత్తుల పుట్టుక! అచ్యుతుని రాజ్యశ్రీ
 కశ్యప ప్రజాపతి మహానిష్ఠాగరిష్ఠుడు. ఏమీ పట్టించుకునే వాడు కాదు.ఇద్దరుభార్యలు దితి అదితి లను సమభావం తో చూసే వాడు.ఆపై తపస్సు లో మునిగే వాడు.అమృతంకోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికారు.60కోట్లమంది అప్సరసలు పుట్టారు.ఉచ్ఛైశ్రవం అనేగుర్రంని రాక్షసులు తీసుకుంటే వారి బుద్ధి చంచలత్వం కీర్తి కండూతికి దర్పణం గా నిలిచింది.వారుణిని దేవతలు తీసుకున్నారు.అది మద్యంకాదు. పానీయం.ఐరావతంని ఇంద్రుడు తీసుకోవడం ఎందుకంటే దేవతలరాజు కాబట్టి.ఆఖరికి అమృతం కోసం కొట్లాటలు చాలా మంది అసురులు చావడంతో దితి గుండెలు బాదుకుని ఏడ్వసాగింది.అందుకే గమ్మత్తుగా భర్తను అడిగింది " అదితి పిల్లలు నా పిల్లల్ని చంపుతున్నారు.ఇంద్రుని చంపే కొడుకు నాకు కావాలి". అదితికి కూడా ఎప్పుడూ శోకమే. బలంతో అసురులు నాకొడుకు లతో చీటికిమాటికి తగాదాపడతారు."అని.కశ్యపుడు ఖచ్చితంగా అన్నాడు" దేవరాజు ఇంద్రుడు చావాలంటే నీవు మానసికంగా శారీరకంగా చాలా శుచిగా ఉండాలి.వెయ్యి ఏళ్ళు కఠిన తపస్సు చేసి తీరాలి." అంతే.. పట్టుదలతో శుక్లప్లవనం అనే ప్రాంతంలో ఘోరతపస్సు ప్రారంభం చేసింది.ఇంద్రుడికి ప్రాణభయం పట్టుకుంది.పదవి పోయి చావు తప్పదు.అందుకే దితి దగ్గరకు వచ్చి " అమ్మా! నీకు సేవ చేస్తా" అన్నాడు.ఆమె అంగీకారం తెలిపింది.నిర్మలమనసుతో ఇంద్రుడు కందమూలాలు ఫలాలు కట్టెపుల్లలు ఏరితెచ్చి గర్భవతిగా ఉన్న దితి సేవలు చేయసాగాడు.ఆమెకూడా ప్రేమ గా ఇంద్రుని చూసుకుంది.దాదాపు వెయ్యి ఏళ్లు పూర్తి ఐతే తాను చావడం ఖాయం.ఇంతలో ఓరోజు దితి తలారా స్నానం చేసి జుట్టు విరబోసుకుని గడపపై తలపెట్టి నిద్ర పోతోంది మిట్టమధ్యాహ్నం వేళ.అశుచి గా ఉన్న ఆమె గర్భంలోకి సూక్ష్మ రూపంలో ఇంద్రుడు ప్రవేశించి పొట్ట లోని పిండాన్ని 7ముక్కలు చేశాడు.అవి" మమ్ము చంపకు" అని ఏడ్వసాగాయి.దితికి మెలుకువ వచ్చింది.బైటకి వచ్చి ఎదురుగా నిలబడిన ఇంద్రుడి తో" నాయనా! నాజుట్టు కొసలు చివర్లు ముడివేయకుండా అలా పడుకోటంతో నేను అశుచి అయ్యాను.ఈఏడుగురు మరుత్తులు 7వాయుస్కంధాలకి అధిపతులుగా చెయ్యి" అని కోరింది...ఈ కథను విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు."రామా! దితి తపస్సు చేసిన ప్రాంతం కి చేరాం.ఇక్ష్వాకువంశరాజు విశాలుడు పేరు మీద ఈనగరంకి విశాల అనేపేరు వచ్చింది.ఇప్పుడున్న రాజు సుమతి." అని వివరించాడు.రాజైన సుమతి విశ్వా మిత్రుడు రామలక్ష్మణులను గౌరవించి ఆతిధ్యం ఇచ్చాడు.సిద్ధాశ్రమంలో ముని యాగరక్షణచేశాడు రాముడు.ప్రస్తుతం బదరీ క్షేత్రం అది.ఇలా మిథిలానగరంకి నడుస్తూ కథలు చెప్పాడు విశ్వా మిత్రుడు.అదీ గురుశిష్యుల సంబంధం 🌸

కామెంట్‌లు