ఓ కవీశ్వరా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పువ్వంటివి
ప్రేమంటివి
మదిలోకోర్కెలు
లేపితివి

ప్రకృతంటివి
పురుషుడంటివి
ఇరువురు
సృష్టికిమూలమంటివి

అందమంటివి
ఆనందమంటివి
అంతరంగములో
ఆశలురేకెత్తించితివి

నవ్వంటివి
నవతంటివి
నాలుగుమాటలుచెప్పి
నమ్మించితివి

అక్షరాలనేరితివి
ఆణిముత్యాల్లాగుచ్చితివి
అల్లి చదివించి
అలరించితివి

పదాలనుపేర్చితివి
పసందుగాపాడితివి
వీనులకువిందునిచ్చి
వేడుకపరచితివి

వెలుగులుచిమ్మితివి
వెన్నెలనుచల్లితివి
మదులనువెలిగించి
ముచ్చటపరచితివి

ఊహలనూరించితివి
భావాలుపొంగించితివి
మదులదోచి
హృదిలోనిలిచితివి

సౌరభాలుచల్లితివి
తియ్యందనాలుపంచితివి
పెక్కువిధాల
మనసులమెప్పించితివి

ప్రణయమంటివి
ప్రభోదమంటివి
పలురీతుల
పలుకులుపారించితివి

పద్యమంటివి
గేయమంటివి
వచనకవితంటివి
వివిధప్రక్రియలందునాకట్టుకుంటివి

మాటలువిసిరితివి
మదులుతట్టితివి
మేటిసాహిత్యమునిచ్చి
మహిలోచిరంజీవివైతివి

కవులకు
స్వాగతం
కవనలోకానికి
సుస్వాగతం


కామెంట్‌లు