జాతీయ స్థాయి మెరిటోరియస్ స్కాలర్ షిప్ కు ఎంపికైన ఎన్ సి సి కేడెట్లు ;-గుండాల నరేంద్ర బాబు
 భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ నేషనల్ కేడేట్ కార్ప్స్ నుంచి కేడేట్ వెల్ఫేర్ సొసైటీ  మెరిటోరియస్ స్కాలర్ షిప్స్- 2023కు కే.ఎన్.ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్, నెల్లూరు 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి క్యాడేట్స్ సాయ చరిణి, బొప్పూరి వకుళ ప్రవీణ్,,కీర్తిపాటి హిమ వర్షిణి,మద్దెల మహీధర్,సాధినేని వెంకట సహస్ర,కంచర్ల వెంకట దినేష్ అను ఆరుగురు కేడేట్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. విజయ్ ప్రకాష్ రావు, ఉపాధ్యాయులు తమ హర్షం వ్యక్తం చేశారు.వీరికి ఈరోజునెల్లూరు కొండాయ పాళెం స్నేహ నగర్లో గల 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి కార్యాలయంలో మెరిటోరియస్ స్కాలర్షిప్ చెక్కులను లెఫ్ట్నెంట్ కమాండర్ & కమాండింగ్ ఆఫీసర్  గణేష్ గొడంగవే  
సెకండ్ ఆఫీసర్ & అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు  సమక్షంలో కేడేట్లకు అందజేసి  అభినందిస్తూ భవిష్యత్తులో వారు మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ధన్యవాదములతో....
గుండాల నరేంద్ర బాబు 
ర్యాంక్ :సెకండ్ ఆఫీసర్ 
హోదా :అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్ 
10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి 
కే ఎన్ ఆర్. నగర పాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్, నెల్లూరు
తేది 15-05-2024
సెల్ :9493235992

కామెంట్‌లు