గఢ్ వాల్ ! సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

 బద్రీనాథ్ కేదార్నాథ్ తో సహా గఢ్వాల్ ప్రాంతం అంతా కొండలమయం.మహాభారతంతో సంపర్కం ఉన్న ప్రాంతాలు ఇవి.అక్కడి ప్రజలు ప్రతిఏటా" పాండవలీల" ప్రదర్శిస్తారు.కురుక్షేత్రయుద్ధంతర్వాత ధర్మరాజు కౌరవ పక్షంలో ని ఐదుగురు యోధులకు ఐదు గ్రామాలు ఇచ్చాడు.వారు దుర్యోధనుడు భూరిశ్రవుడు కర్ణ ద్రోణ అశ్వత్థామ.తాము ఐదూళ్లు అడిగితే దుర్యోధనుడు నిరాకరించాడు.ధర్మరాజు దాన్ని గుర్తుపెట్టుకుని ఇలా దానం చేశాడు.గఢ్ వాల్ లో ఈ ఐదుగురు కౌరవయోధుల్ని తమ క్షేత్ర దేవతలు గా పూజించి కొలుస్తారు.యుద్ధంలో బంధువులు స్నేహితులు చనిపోటంతో పాండవులు పశ్చాత్తాపంతో రగిలిపోతారు.చిత్తశాంతికోసం వారు శివుని అర్చించాలి అని హిమాలయ పర్వతాలకి వెళ్లారు.కానీ అక్కడ శివుడు ఎద్దు రూపంలో ఉండి వారిని చూస్తూనే పారిపోతాడు.పాండవులు ఆవృషభాన్ని వెన్నంటి వెళ్తారు.ఆది భూమి వైపు పరుగులు పెట్టి అదృశ్యం అవుతుంది.భీముడు దాని మూపురం పట్టుకుని ఆపేశాడు.అదే లింగాకారం ధరించింది.శివుని అనుగ్రహం ఉపదేశం తో పాండవులు రాజ్యానికి తిరిగి వచ్చి ధర్మపాలన గావించారు.తిరిగివారు ఇంద్రుని కై అన్వేషిస్తూ హిమాలయాలకు వెళ్లారు.అప్పుడే విష్ణువు ఓరేగిచెట్టు కింద ధ్యానం లో కూర్చుని ఉండటం చూశారు.బద్రీనాథ్ లో నరనారాయణులు ఉన్నారు.శివుడు విభూది తో విష్ణువు చందనం నీటిలో మమేకమై ఉంటారు.ఇక్కడి ప్రజల నమ్మకం ప్రకారం శివుడు గంగతో ఉత్సాహం గా ఉంటే విష్ణువు ఉదాసీనంగా శోకతప్తురాలైన యమునతో ఉన్నాడు.ఆది శంకరాచార్యులవారు ఈరెండు నదులను ఈ ఆలయాలను తన అద్వైత వేదాంతంతో జోడించారు.ఇలా గఢ్ వాల్ ప్రాంతం అంతా మహాభారతం శివకేశవ ఆరాధన చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో మహాభారత కథ ను ప్రదర్శిస్తారు 🌷
కామెంట్‌లు