శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
701)సత్తా -

సజాతీయా,విజాతీయమైనవాడు 
స్వగత బేధరహితమైనవాడు 
అనుభవాల స్వరూపమున్నవాడు 
సత్తాను చూపించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
702) సద్భుతి-

పరమోత్క్రుష్టమైనట్టి వాడు 
మేధాస్వరూపములో నున్నవాడు 
గొప్ప సంపదలున్నట్టి వాడు 
మంచి సత్తాను గలిగినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
703)సత్ పరాయణః -

సజ్జన పరమగతి యైనవాడు 
ధర్మపరాయణత్వం గలవాడు 
మంచినడవడికలు యున్నవాడు 
సద్బుద్ధిని గలిగినట్టివాడు 

శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
704)శూరసేన -

శూరులైన సైనికులు గలవాడు 
పరాక్రమవంతులకు నాయకుడు 
యుద్ధవీరులు వున్నట్టి వాడు 
ధీరులైన భటులున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
705) యదుశ్రేష్ఠ -

యాదవవంశంలో శ్రేష్ఠమైనవాడు 
నందగోపుని వంశీకుడైనవాడు 
కృష్ణావతారము ధరించినవాడు 
యదువీరులలో సర్వోత్తముడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు