సహయం.; జి. విజయకుమారి
 పూర్వం దండకారణ్యంలో ఓ చీమ,ఓ చిలుక, ఓ తాబేలు స్నేహంగా వుండేవి. ఎవరికే కష్టం వచ్చినా బకరికోకరు సహాయంచేసుకోవాలని మాటతి సుకున్నాయి. వారు ముగ్గురూ ఆడుతూ. పాడుతూ ఆనందంగా వున్న సమయంలో ఎండాకాలం వచ్చింది. అన్ని చెట్లు ఎండి పోయాయిు. ఆరోజు ఆ ముగ్గురికీ బాగా ఆకలివెస్తుంది.. ఆహారం కోసం వెతుకుతుంటె ఓజామచెట్టుకి ఓజామ కాయ మాత్ర మేవుంటుంది. అదిచూసిన చిలుక నేను వెళ్ళి ఆ జామకాయను కోసుకు వస్తాను. మన ముగ్గురం కలసి ఆ జామకాయను - తిందాము. మన ఆకలి తిరుతుంది అని చెప్పి వెంటనే జామకాయ దగ్గరకు వెళుతుంది.
ఈలోగా ఆ వైపుకు వచ్చినవేటగాడు. ఆకలివేయడంతో అతనుకుండా జామకాయను చుస్తాడు కానీ చిలుక వుండడంతో దానిపైకి బాణం వేస్తాడు బాణనికి భయపడి చిలుక పట్టుకున్న జామకాయను వదిలి దురంగా ఎగిరిపోతుంది. ఇదంతా చుస్తున్న చీమ కోపంతోటి ఆ వేటగాణ్ణ గట్టిగా కుడుతుంది. అబ్బా నొప్పి అనుకుంటూ తనను కుట్టిన చీమను చంపాలని అది ఎక్కడవుందో వెతుకుతూ వుంటాడు.ఇదంతా చుస్తున్న తాబేలు వెంటనే చీమను దగ్గరకు లాక్కొని తన డొప్పలోకి దాన్ని తీసేసుకుంటుంది.
ఈలొగా చిలుక కిoదపడిన           జామ పండును తీసుకొని ఎగిరిపోతుంది. అదిచూసిన వేటగాడు అయ్యో అనుకుంటూ అక్కడనుండి తిరిగి నిరాశథో వెళ్ళిపోతాడు. వేటగాడు వెళ్ళిన తరువాత చిలుక జామపండును తీసుకు వచ్చి తాబేలు దగ్గరపెడుతుంది. చిలుక ,చీమ, తాబేలు ముగ్గురు కలసి జామపండుని తినివారి ఆకలిని తీర్చుకుంటారు-
నీతి :- ఆపదలో వున్నపుడు బకరికొకరు సహయం చేసుకోవాలి.

కామెంట్‌లు