*రాము తెలివి"* ;- - *డా.వాసరవేణి పరశురాం. బాలసాహిత్య రచయిత, సింగారం, రాజన్న సిరిసిల్ల*

 అనగనగా గుండారం ఊరు. ఆ ఊరిలో  సురేశ్, సువర్ణ అనే దంపతులు ఉన్నారు.వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.వీరిది ఉత్తమ కుటుంబం. వీరికి రాము అను కొడుకు ఉన్నాడు. అతడు రెండవ తరగతి  చదువుతున్నాడు. రోజు బడికి పోతాడు. సాయంకాలం దోస్తులతో ఆడుకుంటాడు. టైరును కట్టెతో తోలడం, సైకిల్తో అటిటు తిప్పడం,పాండబ్బ ఆడటం ,గోటీలు ఆడటం చేస్తాడు. రాముకు నాయనమ్మ రేణుక ఉంది. నాయనమ్మ  అంటే రాముకు ఎంతో ఇష్టం. నాయనమ్మకు రాము అంటే ఇష్టం . సువర్ణ కాయలు,పండ్లు నాయనమ్మకు ఇచ్చిరా అనగానే నిమిషంలో  ఇచ్చి వస్తాడు. నాయనమ్మ  ఇవి తిను అంటాడు. అన్నం తెచ్చి తినుమంటాడు. రోజు నాయనమ్మ దగ్గర  కథలు చెప్పించుకుంటాడు. రాముకు సాహసం కథలంటే  చాలా ఇష్టం. సురేష్ , సువర్ణ రోజు పొలం పనులకు వెళ్లుతారు.ఒకరోజు పగలు బడినుంచి వచ్చాడు. నాయనమ్మ నీళ్లని వెళ్లి కాళ్ళు జారి బావిలో పడింది. అది రాము వస్తూనే చూచాడు . అయ్యో  నాయనమ్మ అని అరిచాడు. చుట్టూ  ఎవరు లేరు.అప్పటికే బావిలోపల నీళ్లలోపడింది.  ఉరికి ఇంట్లోనుంచి పొడుగు తాడు తెచ్చాడు. తాడుకొన బావిలో విసిరాడు. మరొక కొన పైన కట్టాడు. తాడును పట్టుకో నాయనమ్మా అని గట్టిగా పిలిచాడు.భయపడకు నాయనమ్మ  అని అరిచాడు.ధైర్యం కోల్పోలేదు.తాడును పట్టుకుంది. ఆ అరుపులకు అందరూ జనం గుమిగూడారు. అయ్యో  పాపం ముసలవ్వ అని కొందరు అంటున్నారు. ఎంత పని అయిపాయే  అని మరికొందరు అనుకుంటున్నారు. మంచి ముసలవ్వకు గిలాంటి ఆపద వచ్చే అని అనుకున్నారు.  బావిలోకి దిగి ముసలవ్వను పైకి తీసారు. అందరినీ చూసింది.రామును చూడగానే ఆనందం పొంగింది . ఆత్మస్థైర్యం వచ్చింది.అయ్యో  రాము నాయనా తాడు వేసి కాపాడావు. నిండా నూరేళ్ళు  నా ఆయుస్సు కూడా పోసుకొని  బతుకు నాయనా అని రాముకు దీవెనలు ఇచ్చింది. అందరు రాము తెలివికి, సమయస్ఫూర్తికి, సాహాసానికీ మెచ్చుకున్నారు.
  
కామెంట్‌లు