సంస్కృతి పరిరక్షణ;-సి.హెచ్.ప్రతాప్
 ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, భావోద్వేగ అంశాలు ఆ సమాజపు సంస్కృతి అవుతుందన్న యునెస్కో నిర్వచించింది. మన భరత భూమిపై పరిఢవిల్లుతున్న  కళలు, జీవన విధానాలు, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు సైతం ఈ సంస్కృతిలో భాగాలే అన్న విషయం ఉనెస్కో గుర్తు చేసింది.. అనేక ప్రత్యేకతల కారణంగా భారతీయ సంస్కృతి సనాతన ధర్మంగా పరిఢవిల్లిందన్న ఆయన, పశువులు, చెట్లు, నదులను పూజించే భారతీయు సంప్రదాయం ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. పేదలకు సాయం చేయడానికి భారతీయులు ధర్మంగా భావించడం, మన జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళు అందరూ కలిసి మెలసి జీవించడానికి సాయపడడం, ఇవన్నీ మన సంస్కృతి గొప్పతనాన్ని కళ్ళకు కడతాయని పేర్కొన్నారు.
భారతదేశం అనేక భాషలు, సంస్కృతుల నిలయమయినందున, భిన్నత్వంలో ఏకత్వం మనందరినీ కలిపి ఉంచింది. అందువలన మనిషి మారినా సంస్కృతిని మరచిపోలేదని, మనిషి ఆదర్శవంతంగా జీవించడానికి సంస్కృతి దోహదం చేస్తుంది. మన భాష సంస్కృతులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఇతరుల భాష సంస్కృతులను గౌరవించడం కూడా అంతే ముఖ్యమన్న విషయం అందరం గుర్తెరగాలి.సంస్కృతిని కాపాడటం కోసం నైతికత నిఘా అవసరం లేదు, కానీ కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఆచరిస్తున్న వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం కచ్చితంగా అవసరమే.  ప్రపంచంలో వివిధ రకాల సంస్కృతులు ఉన్నాయి. సంస్కృతి అనేది కేవలం ఒక సామాజిక కట్టుబాటో లేదా వాతావరణ పరిస్థితుల వల్లో, ఇతర ప్రభావాల వల్లో ఒక ప్రత్యేక రీతిలో జీవించడమో ఐతే, అది వేరే విషయం. కానీ భారతదేశ సంస్కృతి ప్రజల్ని  క్రమంగా ఆధ్యాత్మికత  వైపు మళ్ళించేటట్లు మలచబడింది అని సద్గురు జగ్గీవాసుదేవ్ ఒక సందర్భంలో సంస్కృతి పరిరక్షణ యొక్క ప్రాశస్థ్యాన్ని గురించి చక్కగా ప్రవచించారు.దేశీయ, స్థానిక, ప్రాంతీయ భాషలను పరిరక్షించుకోవడం ద్వారానే మన సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించుకోవడం సాధ్యమవుతుంది.స్థానిక, ప్రాంతీయ భాషలను పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే 90 శాతం ఉన్న ప్రపంచ వ్యాప్తంగా స్థానిక భాషలు కనుమరుగైపోయి, 10 శాతం ఉన్న ఆధిపత్య భాషలే తమ పెత్తనాన్ని చెలాయించే ప్రమాదం ఉందని, ఆధునిక యుగంలో యువత, పిల్లలు, మహిళలు సైతం టీవీ, సినిమాలు, సెల్‌ఫోన్లకు బానిసై మనదేశ సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోతున్నారని, దేశీయ భాషలను కాపాడుకోవడం వల్లే మానవ , సాంఘిక, కళాశాస్త్రాలు అభివృద్ధి చెందుతాయని పలువురు విద్యావేత్తల హెచ్చరిస్తున్నారు.  

కామెంట్‌లు