సుప్రభాత కవిత -బృంద
రంగుల గొడుగులా
వంగిన కొమ్మలొ
విరిసిన పువ్వుల
నీడలో గమనం

అందాలు చిందేటి
అపురూప పథాన
అడుగులకు మడుగులొత్తి
అలరారు రాలుపూలు

ఊహలన్నీ వాస్తవాలై
స్వప్నాలన్నీ సాక్షాత్కరించి
కనుల విందు చేస్తూ
కలలు అందేలా వాలు కొమ్మలు

మౌనానికి మాటలొచ్చి
మధురమైన పాటపాడే
ముచ్చటైన క్షణాలను
మూటగ ఇచ్చే తరుణాలు

భావాలకు నడకలొచ్చి
పరుగుపరుగున కదులుతుంటే
పాదాలు లయతోటి జతగా 
కదిలేటి కమ్మని పయనాలు

చూపులే దివ్వెలై వెలుగుతూ
దారంతా  వెన్నెల పరుస్తూ
మదిలోన మంచు కురుస్తూ
సడిలేన సందడుల కోలాటాలు

అరుధైన అనుకోని 
ఆనందమార్గాన 
ఆహ్లాదభరితమైన
అపురూపక్షణాలకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు