ఓవర్ థింకింగ్! .. సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒక విషయం గురించి ఆలోచించాలి.లేకుంటే అనర్ధ దాయకం గూడా.కొత్తవారితో బాగా ఆలోచించి మాట్లాడాలి.మనకంటే పెద్ద చిన్న వారైనా సరే నవ్వుతూ పలకరించి ఆపై వినడం మంచిది.మనం ఆవేశంగా అతిసంతోషంతో  బడబడమాట్లాడి‌ ఆపై అయ్యో అలా వాగకుండా ఉంటే బాగుండేది అని తెగ ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటే లాభంలేదు.ఈ ఆలోచన జుట్టు పీక్కునే అలవాటు ఓవర్ థింకింగ్ అనే మానసిక జబ్బు.రోజంతా ఆవిషయం బుర్రలో గ్రైండర్ లాగా గిర్రు‌గిర్రున తిరుగుతూ తిండి తిప్పలు లేక నిద్ర పట్టని స్థితిలోకి నెడుతుంది.మనసుకి బాధ కల్గితే ఆప్తులకు చెప్పి తీరాలి.బడిలో ముఖ్యం గా హాస్టల్లో ఉండే వారు మింగలేక కక్కలేక బాధపడటం సామాన్యమైనది అని నేటి సైకాలజిస్టులు సైక్రియాటిస్టులు చెప్తున్నారు.ఇంట్రావర్ట్ స్వభావం మరీ ప్రమాదం.ఆత్మీయులకు కనీసం టీచర్ కి మనసులో గుంజాటన చెప్పేలా పిల్లలకి నేర్పాలి.బాధను పంచుకుంటే మనసు హాయిగా తేటగా తుడిచిన అద్దంలాగ వర్షపు నీటితో దుమ్ము ధూళి పోయిన ఆకులు పూలు లాగా  నిర్మలంగా ఉంటుంది.ప్రపంచంలో హాయిగా జాలీ జాలీగా ఆరోగ్యం గా ఉండేవారు జపాన్ దేశస్థులు.చింతపుంతలువిడిచి  గడిపే తత్వం వారిది.ఇది పరిశోధనల ద్వారా తేలిన సత్యం.మనకు చేతకానిది ఐతే వదిలేయడం ఉత్తమం.మనశక్తి చూసుకుని ముందడుగు వేయాలి సుమా! హాయిగా పచ్చికపై నడవడం తోట పార్కు పిల్లలతో గడపటంతో మనం ఆవిషయం మర్చిపోయి కొత్త లోకంలోకి అడుగు పెడతాం.లేదా గుడికి వెల్తే భక్తి ముక్తి.ఇతరుల కష్టాలు బాధలముందు మనవి బలాదూర్.తృప్తి ,ఇతరులతో పోల్చుకోవడం మానేస్తే రోగాలు సగం మాయం. కష్టం రాగానే "బాబోయ్ ఎలా?" అని ఆలోచిస్తూ కూచునే బదులు  దాని నుంచి ఎలా బైట పడాలి అని ఆలోచిస్తే మంచిది.లెక్క వచ్చే దాకా ప్రయత్నం చేస్తాం.రాకపోతే ఇంకొకరిని అడుగుతాం.మనకు సరైన మిత్రులు దొరక్క పోతే దైవం మీద భారం వేయాలి.ఎందుకంటే కొందరు మనబలహీనత‌ కనిపెట్టి ఆపై టముకు‌కొడ్తారు.దానితో అందరికీ తెలిసిందే అనే ఆత్మ న్యూన్యతాభావంతో‌ ఇంకా డిప్రెషన్ లో కి పోతాం.ఇప్పుడు చిన్న కుటుంబం చింత వంతలకుటుంబం కావడంతో " నన్ను పట్టించుకునే నాథుడే లేడు" అని పిల్లా పెద్ద బాధపడే కాలం దాపురించింది.అందుకే మంచి పుస్తకం జీవితచరిత్రలు చదివితే మనం హాయి గా సంతోషంగా గడపవచ్చు.దీన్ని ఆధ్యాత్మిక విషయాలపై కేంద్రీకరిస్తే ఆత్మ విశ్వాసం దైవ సహాయం లభిస్తుంది అనే నమ్మకం కల్గుతుంది 🌷
కామెంట్‌లు