అనిపిస్తోంది;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 హరివిల్లులోని అందం 
నీమోమున విరిసింది
పూలలోని తీయనితేనె
నీపలుకులోన ఉన్నది
చెందాయిలోని వెలుగు
నీకన్నుల్లో మెరిసింది
తారకల తళుకులన్నీ
నీబుగ్గల నిగ్గులేకదా
తుమ్మెద జుమ్మనెనాదం
నీపాటల కమిరింది
అడవిలోని నెమలినాట్యము
నీఅడుగుల వయారమే
గగనపు నెలవంక
ఇలవంకదిగి ననుచేరింది
అందుకే నాకు
వర్తమానమే ముద్దైంది
భూతకాలము రద్దైంది
ఇక భవిష్యత్కాలం 
వద్దేవద్దనిపిస్తోంది సుమా!!
************************************
.

కామెంట్‌లు