- యుగ పురుషునికి నా అక్షర సుమాలు.;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్విశాఖపట్నం.
నందమూరి అందగాడు
నటనకే నడక నేర్పినవాడు
శ్రీరాముడైన శ్రీకృష్ణుడైన
తెలుగునాటే కాదు వసుదైకానికే గుర్తువచ్చే నటుడు.

దుర్యోధనుడైన, రావణాసురుడైన ప్రతి నాయకుల పాత్రలో కూడా జీవించి పౌరాణిక సినిమాలకే ప్రాణంపోసినవాడు.
రక్తసంబంధం ,అన్నా చెల్లెలు లో అన్నగా
దేవత ,నిర్దోషిలలో భర్తగా
"జన్మమెత్తితిరా నరుడా
అనుభవించితిరా" అని
గుడి గంటలలో
"బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా" అని దేవత సినిమాలలో ఘంటసాల పాటకి నందమూరి నటన
ప్రేక్షకుల హృదయం ద్రవించి
'న భూతొ నభవిష్యతి'గా
చిరస్మరణీయం

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా
రెండు రూపాయల కిలో బియ్యం
పురుషులతో బాటు స్త్రీలకు ఆస్తిలో సమానహక్కు
అందరికి విద్యా, వైద్యమని
ప్రజాలవద్దకే పాలన అని
ముఖ్యమంత్రి గా
ప్రధానంగా తెలుగువారిని
మద్రాసీ అని గాక గుర్తింపు తెచ్చిన ప్రజా హితుడు
నటనాగ్రేసరుడు
ప్రధాన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి
ప్రతిపక్షాలను సమైక్య పరచిన పద్మశ్రీ నందమూరి తారకరామారావు
మీరు యుగపురుషులే
మీ కివే నే నందిస్తున్న అక్షర కుసుమాలు.....!!
.............................


.........................

కామెంట్‌లు